Pawan kalyan student life janasena party

pawan kalyan, pawan kalyan student life, pawan kalyan political party, janasena party, janasena party speech, pawan press meet live, pawan janasena party meeting.

pawan kalyan student life "janasena party"

పవన్ చరిత్ర గురించి నిజం చెప్పిన క్లాస్ మెంట్ ఫ్రెండ్

Posted: 03/14/2014 05:39 PM IST
Pawan kalyan student life janasena party

పవన్ కళ్యాణ్  రాజకీయ పార్టీ పెడుతున్న సమయంలో.. అనేక  కొత్త కొత్త  నిజాలు పవన్ కళ్యాణ్ గురించి తెలుస్తున్నాయి.  ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్  ఒకవైపే అందరికి తెలుసు. కానీ  ఆయన చదవుకునే రోజుల్లో  జరిగిన కొన్ని విచిత్రమైన  సన్నివేశాలను    పవన్ కళ్యాణ్ చిన్ననాటి  మిత్రుడు,   క్లాస్ మెంట్  గునరంజన్  పవన్ అభిమానులతో పంచుకున్నారు. 

1987 లో పవన్ తన స్నేహితుడు గునరంజన్ తో కలసి నెల్లూరులోని వినయ్ బాబు అనే లెక్కల మాస్టారు వద్ద ట్యూషన్ నేర్చుకోవడానికి కలిసి వేళ్లటం వారట. అదే విధంగా జూనియర్ కాలేజీ లో కూడా పవన్ ఎప్పుడు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ గా గునరంజన్ తో కలసి కుర్చునేవాడట. 

అయితే వారి లెక్కల మాస్టారు వినయ్ బాబు తానూ చెబుతున్న లెక్కలు పవన్ కి అర్ధం అవుతున్నాయో లేవో తెలియక పవన్ వైపు చాక్పీస్ విసిరటం జరిగేదని చెబుతున్నారు.  చదువులో వెనుకబడి ఉంటె పవన్ 8గ్రేస్ మార్కులతో ఇంటర్ పరీక్ష గట్టేక్కాడట. 

దాంతో చదువుపై ఆసక్తి లేని పవన్ ఇక తానూ చదువుకి పనికిరానని తన స్నేహితుడు గునరంజన్ తో చెప్పేవాడట. ఆ మాటలు గునరంజన్ చిరంజీవిలా సినిమాల్లోకి వెళ్లి హీరోగా ప్రయత్నించమంటే ఎందుకు నాపై అంతటి జోక్స్ వేస్తున్నావు అని నవ్వేవాడట. 

కానీ ఎదో ఒకటి చేయాలనీ అనుక్షణం మదన పడేవాడని చెబుతూ తన కాలేజీ రోజుల్లో తన తల్లితండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని తానూ దాచుకోకుండా స్నేహితులందరికీ డ్రింక్స్ కొనిచ్చేవాడని అలనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు గునరంజన్.

ఎప్పుడు బిడియంగా కనిపించే పవన్ ఈరోజు పవర్ స్టార్ గా ఎదిగిపోయి ఓ రాజకీయ పార్టీ స్థాపించే స్థాయికి ఎదుగుతాడని తానూ ఎన్నడూ ఊహించలేదని పవన్ వంటి మంచి వ్యక్తులు నేటి రాజకీయాలకు ఎంతో అవసరం అని చెప్పుకొచ్చాడు పవన్ స్నేహితుడు గునరంజన్.

 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles