Allu arjun and ram charan in gunday remake

Allu arjun and Ram charan in Gunday, Bunny and Cherry in Gunday remake, Geetha Arts, Arjun Kapoor, Ranveer Singh, Priyanka Chopra

Allu arjun and Ram charan in Gunday remake. Gunday starring Arjun Kapoor, Ranveer Singh and Priyanka Chopra emerged as a super hit in Hindi and now sources.

‘గుండే ’ రీమేక్ లో బన్నీ - చరణ్

Posted: 02/25/2014 03:04 PM IST
Allu arjun and ram charan in gunday remake

టాలీవుడ్ మల్టీస్టారర్ చిత్రాల హవా కొనసాగుతున్న తరుణంలో చాలా మంది హీరోలు అలాంటి చిత్రాల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే వెంకీ, మహేష్ రామ్ లాంటి మల్టీస్టారర్ చేయగా, ఇప్పుడు రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ లు కూడా నటిస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఓ మల్టీస్టారర్ చిత్రం చేయాలని అనుకుంటున్నట్లు మెగా కంపౌండ్ వర్గాల సమాచారం.

ఇటీవల చరణ్ ‘ఎవడు ’ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన బన్నీ ఈసారి పూర్తి స్థాయి సినిమాలో నటించాలని భావిస్తున్నాడట. అందుకోసం ఇటీవల బాలీవుడ్ లో హిట్టైయిన ‘గూండే ’ సినిమాను తెలుగులో తాను, చరణ్ కలిసి చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నాడట. మొన్న చేసిన గెస్ట్ రోల్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ మల్టీ స్టారర్ పై ఆసక్తి కనబరుస్తున్నాడట.

ఈ ఇద్దరూ హీరోలుగా ఓ సినిమా చేయాలి అని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్ళు మంచి కథ దొరకలేదు. కానీ ‘గుండే ’ సినిమా స్టోరీ ఇద్దరి నచ్చడమే కాకుండా, ఇద్దరి ఇమేజ్ కి సరిగ్గా సరిపోయే సినిమా అవుతుందని వారు భావిస్తున్నారట. దీని గురించి ఓ స్టార్ డైరెక్టర్ తో చర్చిస్తున్నారట. అన్నీ కుదిరితే ఈ ఇద్దరు మెగా హీరోలను మరోసారి ఒకే స్క్రీన్ పై చూడొచ్చన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles