Rajini in bharateeyudu sequel

Rajinikanth, Shankar, Rajini in Bharateeyudu Sequel, third combination, Sivaji, Vikrama Simha, Kochadaiyaan, Manoharudu, I

Shankar and Rajinikanth seem to have held discussions about their next venture

కమల్ హాసన్ సినిమాలో రజినీకాంత్

Posted: 01/28/2014 09:37 AM IST
Rajini in bharateeyudu sequel

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే జనాలకు పిచ్చ క్రేజ్. ఆయన స్టైల్, యాక్షన్ అంటే ఇష్టపడని ప్రేక్షకుడు ఉండడు. అలాంటి ఆయన సినిమాలు విడుదలవ్వక మూడేళ్లు దాటిపోయింది. అప్పుడెప్పుడో వచ్చిన ‘రోబో ’ సినిమా తరువాత రజినీ నటించిన బొమ్మ వెండితెర పై పడలేదు. ప్రస్తుతం తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో వస్తున్న ‘కొచ్చాడయాన్ ’ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది.

ఆ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఆ సంగతి అటుంచితే రజినీ చేసిన గత రెండు చిత్రాలు సాంకేతిక పరంగా ఉన్నతమైనవే కావడంతో , మంచి సబ్జెక్ట్ , సమాజానికి ఉపయోగపడే సినిమాలు, రజినీలోని మాస్ యాంగిల్ ని ఆవిష్కరింపజేసే సినిమాలు లేకపోవడంతో ఇప్పుడు వాటి పై ద్రుష్టి సారించినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా తన తరువాతి సినిమాను ప్రముఖ చిత్రాల దర్శకుడు అయిన శంకర్ దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో శంకర్ తీసిన ‘భారతీయుడు ’ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమాలో రజినీ నటించబోతున్నాడని సినిమా వర్గాల సమాచారం.

అప్పట్లో అవినీతి పై వచ్చిన ఈ సినిమా ప్రభుత్వ అధికారుల్లో, రాజకీయనాయకుల్లో గుబులు పుట్టించింది. అలాంటి ఈ సినిమాకు కథను నేటి ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనలు, అన్నా హజారే ఉద్యమాల ఇతివృత్తంతో రూపొందిస్తున్నారని అంటున్నారు. అంటే, అప్పట్లో కమల్ చేసిన పాత్రను ఇప్పుడు మళ్లీ రజనీకాంత్ పోషిస్తాడన్నమాట. త్వరలో రజినీ ‘భారతీయుడు -2’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles