Pawan kalyan in ali tv game show ali 369

Pawan kalyan in Ali TV Game Show Ali 369,TV screen for this Diwali, E TV comedy show, actor-comedian Ali, Ali 369 show

Pawan kalyan in Ali TV Game Show Ali 369,TV screen for this Diwali, E TV comedy show, actor-comedian Ali, Ali 369 show

ఆప్త మిత్రుడి కోసం పవన్ బుల్లి తెర పై

Posted: 11/01/2013 03:20 PM IST
Pawan kalyan in ali tv game show ali 369

పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా చాలా మంచోడు అనే పేరు ఉంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, స్నేహితులకు మాట ఇస్తే తప్పకపోవడం వంటి గుణాలు ఉన్న పవన్ కళ్యాణ్ తన ఆప్త మిత్రుడికి ఇచ్చిన మాటకోసం కాసేపు తన స్టార్ డమ్ ని పక్కన పెట్టి బుల్లితెర ఓ షోలో కనిపించబోతున్నాడు.

వెండితెర పై తిరుగులేని ఆధిపత్యాన్ని, అభిమానాన్ని, ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న పవన్ తొలిసారి ‘ఆలీ ’ యాంకర్ గా చేస్తున్న బుల్లితెర ప్రోగ్రాం  ‘ఊ ఈజ్ ద కాంట్రవల్లి ’ షో పాల్గొనబోతున్నాడని సమాచారం. దీపావళి పండగను పురస్కరించుకుని నవంబర్ 3న ప్రసారం అయ్యే షోలో పవన్ కళ్యాణ్ కనిపిస్తారని అంటున్నారు. దీనికి సంబంధించిన షూటింగును కూడా ఇటీవల చిత్రీకరించనట్లు చెబుతున్నారు. దీని పై స్పష్టమైన ప్రకటన రావాల్సింది. పవన్ ఆలీకి ఇచ్చిన మాట కోసం ఈ షోకి రాబోతున్నాడని అంటుంటే...

అదేం కాదు ఇటీవల తాను నటించిన ‘అత్తారింటికి ’ 100 కోట్లకు పరుగులు తీస్తున్న క్రమంలో కొత్త సీన్లు కలిసిన తరువాత దాన్ని ప్రమోట్ చేయడానికే ఈ షోలో పాల్గొన్నట్లు చెబుతున్నారు. ఏమైతేనేం త్వరలో పవన్ బుల్లితెర అభిమానుల్ని అలరించబోతున్నాడట. ఒక స్టార్ హీరో ఇలాంటి ప్రోగ్రాంలో పాల్గొనడం ఇదే మొదటి సారి కావచ్చేమో ? దీపావళి నాడు పవన్ బుల్లి తెర ఫై కనిపిస్తే అభిమానులకు అంతకన్నా సంతోషమైన దీపావళి ఏముంటుంది చెప్పండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles