Anchor udaybhanu political entry

Anchor Udaybhanu Political Entry, daybhanu Political Entry From Karim Nagar, Udaya Bhanu to contest from Karimnagar in 2014 Elections, Udaya Bhanu into politics, Udaya Bhanu political entry, Udaya Bhanu to contest from Karimnagar in 2014 Elections

Anchor Udayabhanu Political Entry with Karimnagar Assembly Ticket from BJP Party.

ఉదయభాను పొలిటికల్ ఎంట్రీ

Posted: 06/26/2013 02:48 PM IST
Anchor udaybhanu political entry

గత దశాబ్ద కాలంగా బుల్లి తెరను తనదైన శైలిలో ఏలిన సెక్సీ యాంకర్ ఉదయభాను తెలంగాణలో మరో రాములమ్మగా అవతారం ఎత్తబోతుందా ? తెలంగాణ రాములమ్మగా పేరుతెచ్చుకున్న విజయశాంతిని ఆదర్శంగా తీసుకొని ఈమె బుల్లితెరను, వెండితెరను వదిలి రాజకీయరంగు పులుముకోవడానికి సిద్ధపడిందా అంటే అవుననే అంటున్నాయి సినీ, రాజకీయ వర్గాలు. ఇప్పటికే ఎంపీగా విజయశాంతి రాణిస్తున్నారు. ఈమె కూడా వెండితెర నుండి రాజకీయాల్లొకి వచ్చింది. ఇప్పుడు ఈమె కూడా అదే బాటలో నడవాలని అనుకుంటున్నట్లుంది. ఈమె కరీంనగర్ జిల్లాలోని తన సొంత నియోజకవర్గం నుండిగానీ, మోయినాబాద్ నుండి వచ్చే 2014 ఎన్నికల్లో బరిలో దిగాలని భావిస్తోందట. ఇప్పటికే బుల్లితెరను వదిలేసి, వెండితెర పై వేశ్యగా మారిన ఉదయభాను రాజకీయ ప్రవేశం చేస్తుందనే వార్త తెలుసుకున్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఈమెను ఎలాగైనా తమ పార్టీలోకి లాగాలనే ప్రయత్నాలు మొదలు పెట్టాయట.

ఈమెకున్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని, ఈమెను తమ పార్టీలోకి తీసుకుంటే లాభం పొందవచ్చనే ప్లాన్ చేస్తున్నాయట. ఉదయభాను తండ్రి మొయినుద్దీన్ ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు. గతంలో తమ గ్రామానికి ఆయన సర్పంచ్ గా కూడా పనిచేశాడు. ఇప్పుడు ఈమె కూడా రాజయాల్లొకి ప్రవేశించి తండ్రి బాటలోనే నడవాలని అనుకుంటుందట. తండ్రి లోని కొన్ని నాయకత్వ లక్షణాలు పునికి పుచ్చుకున్న ఈ అమ్మడు బుల్లితెర పై రాణించినంతగా రాజకీయాల్లో రాణిస్తుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles