Mahesh babu set for a bollywood debut

Mahesh, south actors, debut, Prithviraj Sukumaran, Ram Charan Teja, Raj and DK, hindi film, Telugu, Dhanush, Vikram, Prithviraj, bollywood, entertainment

Its the season of south actors making their way into Bollywood. After Prithviraj Sukumaran.

మహేష్ ఎంట్రీ ఖరారు అయింది

Posted: 05/23/2013 10:58 AM IST
Mahesh babu set for a bollywood debut

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు టాప్ హీరోల్లో ఒకడు. ఈయన పలు బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ చేయడంతో ఈయనకు జాతీయంగా మంచి పాపులారిటీ వచ్చింది. దీంతో మహేష్ మార్కెట్ మరింత పెరిగింది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి తన భార్య నమ్రత మహేష్ ని బాలీవుడ్ కి పంపే ప్రయత్నాలు చేస్తుందని ఆ మధ్యన వార్తలు వచ్చాయి. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. ఆ మధ్యన మహేస్ కూడా బాలీవుడ్ కి వెళ్ళటం లేదు అని చెప్పాడు. కానీ ఎట్టకేలకు మహేష్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారు అయింది. తెలుగు వాళ్లయిన బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్ నిడుమోరు -కృష్ణ డీకే ఈ విషయంలో విజయం సాధించారు. వీరు చెప్పిన కథ మహేష్ కి నచ్చడంతో ఆయన పచ్చజెండా ఊపినట్టు సమాచారం. గత కొన్ని రోజులు నుండి వీరి దర్శకత్వంలో మహేష్ సినిమా చేస్తున్నాడనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ విషయాన్ని ఆ ఇద్దరు దర్శకులలో ఒకరైన రాజ్ కన్ ఫార్మ్ చేశాడు. ప్రస్తుతం మహేష్ సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు, దాని తరువాత శీను వైట్లతో ఆగడు సినిమా చేయనున్నాడు. ఈ సినిమాల తరువాతనే మహేష్ బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా మహేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడనే వార్తతో అభిమానులు తెగ సంబరపడి పోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles