Sridevi gift for boney kapoor

sridevi, boney kapoor, sridevi couple, boney couple, sridevi family, sridevi gift for boney kapoor, sridevi boney kapoor marriage life, sridevi hot pics, sridevi wallpapers,

sridevi gift for boney kapoor

5.gif

Posted: 11/09/2012 08:04 PM IST
Sridevi gift for boney kapoor

sri_ee

ఎన్నాళ్లైనా తరగని ప్రేమానురాగాలకు తార్కాణం ఆ జంట. అదే బోనీకపూర్, అందాల తార శ్రీదేవి జంట. ఎంతటి ఒడిదుడుకులు ఎదురైనా, ఎంత ఆనందోత్సాహం వచ్చినా వీరిరువురూ కలిసి పంచుకోవటం మనం ఎన్నో సందర్భాల్లో చూశాం. తాజాగా దీనికి మరో ఉదాహరణ తోడైంది.  అత్యంత ఖరీదైన కారును తన శ్రీవారికి కానుకగా ఇచ్చి తన ముచ్చట తీర్చుకుంది శ్రీదేవి. ఇటీవల జర్మన్ కంపెనీ మార్కెట్లోకి ప్రవేశ పెట్టిన 'పోర్షే కయూన్' లగ్జరీ కారును శ్రీదేవి తన భర్త బోనీకపూర్ కు గిఫ్టిచ్చింది. అత్యున్నతమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఎన్నో ప్రత్యేకతలు ఈ కారుకి వున్నాయి. ఇక్కడ ఇంకో విశేషమేంటంటే ఈ కారును సొంతం చేసుకున్న వందో కష్టమర్ శ్రీదేవి కావటం కొసమెరుపు.
     ఈ సంగతిలా ఉంటే,  రెండున్నర దశాబ్దాల క్రితం వచ్చిన 'మిస్టర్‌ ఇండియా' హిందీ చిత్రం అప్పట్లో ఓ సంచలనం. అనిల్‌కపూర్‌, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పడీ చిత్రానికీ సీక్వెల్‌ నిర్మించడానికి నిర్మాత బోనీకపూర్‌  సన్నాహాలు చేస్తున్నాడు. మొదట్లో మరో దర్శకుడిని తీసుకుందామని ఆయన ఆలోచించినప్పటికీ, తర్వాత మనసు మార్చుకుని ఒరిజినల్‌ తీసిన శేఖర్‌ కపూర్‌నే దీనికి దర్శకుడిగా నియమించు కున్నాడు.
      అయితే.. బాలీవుడ్ ప్రముఖ హీరోహీరోయిన్లు ప్రధాన పాత్రలు పోషించే ఈ 'మిస్టర్‌ ఇండియా-2'లో అనిల్‌, శ్రీదేవి జంట కూడా ముఖ్య పాత్రల్లో కనిపిస్తారట. ఇక బాలీవుడ్‌ వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఇందులో నెగటివ్‌ క్యారెక్టర్లో నటిస్తాడని కూడా బాలీవుడ్ వర్గాలంటున్నాయి. మరో సన్షేషనల్ మూవీని శ్రీదేవి భర్త బోనీ అందిస్తున్నారన్నమాట.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Samantha drop from ram charan evadu movie
Sensor objections for busstop movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles