Sensor objections for busstop movie

busstop movie trailer, bus stop movie video, sensor objections for busstop movie, bus stop wall papers, sensor board, director maruti, eerojullo movie

sensor objections for busstop movie

5.gif

Posted: 11/08/2012 03:29 PM IST
Sensor objections for busstop movie

Bus-Stop

        'నేటి ట్రెండ్ ఇదే' అంటూ 'ఈరోజుల్లో' సినిమా తీసి సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మారుతి, అదే తరహాలో తాజా చిత్రం 'బస్ స్టాప్' రూపొందించాడు. అయితే సెన్సార్ బోర్డు ఈ మూవీ మీద తీవ్ర అభ్యంతరాలు వెళ్లగక్కింది. అసభ్యం... అశ్లీలత...ద్వందార్ధాలతో ఈ సినిమా ఉందని అందుకే సెన్సార్ విపరీతమైన కట్స్ ఇచ్చింది. దాంతో, చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ ... కె.సి.శేఖర్ బాబు నేతృత్వంలోని ఆర్సీ (రివైజింగ్ కమిటీ)కి వెళ్ళారు. అక్కడ కూడా వీరికి చుక్కెదురైంది. ఈసారి మొత్తం 50 కట్స్ వచ్చాయట. వీరు చెప్పిన కట్స్ పాటిస్తే, ఇక సినిమాలో మిగిలే నిడివి అతి తక్కువ. అందుకే, ఇప్పుడు నిర్మాత ఢిల్లీలోని ట్రిబ్యునల్ కి వెళ్లి అమీతుమీకి సిద్దమయ్యారు. సినిమాను తిలకించిన ట్రిబ్యునల్ కేవలం 5 చిన్న చిన్న కట్స్ చెబుతూ, 'A ' సర్టిఫికేట్ ను జారీ చేసింది. ఈ నిర్ణయం ఎంటైర్ మూవీ టీం నే కాదు, తెలుగు చిత్రసీమను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో యమజోరుమీదున్న బస్టాప్ టీం మూవీని ఈ నెల 10 వతేదీన విడుదల చేయబోతున్నారని సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sridevi gift for boney kapoor
Sitamma vakitlo sirimalle chettu sankranthi release  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles