Nayak movie director vv vinayak remuneration

nayak movie director vv vinayak remuneration, vv vinayak nayak movie, director vinayak fee for making movies, ramcharan vv vinayak movie nayak news update, nayak wallpapers, director vv vinayak pictures, vv vinayak hits

nayak movie director vv vinayak remuneration

17.gif

Posted: 11/04/2012 03:55 PM IST
Nayak movie director vv vinayak remuneration

vv_inn

హీరోలను బట్టే సినిమాలకు వెళ్లేవారొకప్పుడు. కానీ ట్రెండ్ మారింది. ఆ మూవీ డైరెక్టర్ ఎవరనేదీ ఇప్పుడు ప్రధానం అయిపోయింది. దీంతో స్టార్ హీరోలకే కాదు.. ఇప్పుడు డైరెక్టర్లకు కూడా క్రేజ్ బాగా పెరిగిపోతోంది. క్రేజీ దర్శకుల పేరుతో నిర్మాతలకు మంచి బిజినెస్ కూడా జరుగుతోంది. దాంతో పాటే రెమ్యూనరేషన్ విషయంలోనూ హీరోల కంటే తామేం తీసిపోమని దర్శకులు నిరూపించుకుంటున్నారు.  తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ వివి వినాయక్ కూడా రెమ్యూనరేషన్ విషయంలో హీరో కంటే టాప్ లో ఉన్నాడు. రామ్ చరణ్ తో తీయబోతున్న 'నాయక్' సినిమా కోసం వినాయక్ 11 కోట్లు తీసుకుంటున్నాడని అనధికార వర్గాల సమాచారం.
        ఈ సినిమాకు గానూ రామ్ చరణ్ రెమ్యూనరేషన్ 9 కోట్లు అని తెలుస్తోంది. వీరిద్దరికే 20 కోట్లు బడ్జెట్ కేటాయించినట్టు భోగట్టా. కాగా  'నాయక్' సినిమాకు మొత్తం 42 కోట్ల బడ్జెట్ అనుకుంటున్నారట. ఇక ఈ సినిమా వచ్చే సంక్రాంతికి భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగాస్టార్ చిరంజీవికి 'ఠాగూర్' వంటి బ్లాక్ బస్టర్ అందించిన వినాయక్ తనకూ అటువంటి హిట్ అందిస్తాడని చెర్రీ భావిస్తున్నాడు. ఇక వివి వినాయక్ కూడా ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందిస్తున్నాట్టు తెలుస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Film making chance by sanghamitra arts
Chiranjeevi khaidi remake with charan harish  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles