Teachers agitation for sorry teacher movie

teachers agitation for sorry teacher movie

teachers agitation for sorry teacher movie

22.gif

Posted: 08/24/2012 07:01 PM IST
Teachers agitation for sorry teacher movie

TEACHERS

     sorry_inn  ఏంటా వరసేంటీ.. ఆ పోస్టర్లేంటీ.. ఆ చేష్టలేంటంటూ టీచర్లు శివమెత్తిపోతున్నారు. 'సారీ టీచర్' సినిమాకు సంబంధించిన పోస్టర్లు చూసి టీచర్లేకాదు.. జనం కూడా కంగు తింటున్నారు. లేడీ టీచర్ అందాల ప్రదర్శన ... స్టూడెంట్ వంకర చూపులుతో ఉన్న ఈ పోస్టర్లు చూసి సభ్యత వున్న వాళ్లు ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో  ఉపాద్యాయ వృత్తిని అపహాస్యం పాలు చేసేలా ... గురు శిష్యుల సంబంధాన్ని అపవిత్రం చేసేలా ఈ సినిమా ఉందంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. యువతను పెడతోవ పట్టించే ఇలాంటి సినిమాలు సమాజానికి హాని చేస్తాయని ఆందోళనకి దిగారు.  ఈ నేపథ్యంలో ఈనెల 24  న విడుదల కానున్న ఈ సినిమాను వెంటనే నిలిపివేయాలంటూ వేసిన పిటీషన్ ను హైకోర్టు స్వీకరించింది. ఈ కేసుపై జస్టీస్ సుభాష్ రెడ్డి నిన్న విచారణ జరిపారు. ఈ సినిమాకు సంబంధించిన సీడీని సోమవారంలోగా హైకోర్టు ముందుంచాలని కేంద్ర సెన్సార్ బోర్డును ... ఈ సినిమా నిర్మాతను కోర్టు ఆదేశించింది. ఈ సినిమా చూశాక కోర్టు తన నిర్ణయాన్ని తెలియజేస్తుందని చెప్పారు. కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. అసలే.. అంతంతమాత్రంగా ఉంటున్న స్టూడెంట్స్ ప్రవర్తన ఇలాంటి సినిమాలతో ఇంకెంత వెర్రితలలు వేస్తుందో అని అంతా హడలి పోతున్నారు.. ఏం సినిమాయో.. ఏంటో... అని నిట్టూర్పుతో.. జనం.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anirudh and andrea romance
Nav deep in young tiger ntr movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles