Allari naresh sets a new record with sudigadu

Allari Naresh, Sudigadu movie, 45 lakhs, overseas rights,

Actor Allari Naresh has already set a new record with his upcoming film Sudigadu. With the tremendous response for the trailers, the overseas rights of the movie were sold out for Rs 45 lakhs

Allari Naresh sets a new record with Sudigadu.png

Posted: 08/04/2012 05:20 PM IST
Allari naresh sets a new record with sudigadu

Sudigadu

అల్లరి నరేశ్ ఇన్ని రోజులూ జనాలను యావరేజీగా నవ్విస్తూ...యావరేజి విజయాలు సాధించేవాడిగానే అందరి అంచానాల్లో ఉన్నాడు. అయితే అతడి తాజా చిత్రం 'సుడిగాడు'తో తన స్థాయి ఏంటో నిరూపించుకొన్నాడు ఈ కామెడీ హీరో. ప్రత్యేకించి తెలుగు ఎన్ ఆర్ ఐలకు అల్లరి మార్కు కామెడీ రిలీఫ్ బాగా ఆకట్టుకొంటోంది. ఇతడి 'సుడిగాడు' ఓవర్సీస్ హక్కులు మంచి రేటుకే అమ్ముడయ్యాయి. ఆ మొత్తం అల్లరి నరేశ్ కెరీర్ లో కొత్త రికార్డు స్థాపించింది. 'సుడిగాడు'ట్రైలర్స్ విడుదలై మంచి క్రేజ్ తెచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్రేజ్ తో ఓవర్ సీస్ బిజినెస్ లో అల్లరి నరేష్ కెరీర్ లో ఇంతవరకూ లేని కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఈ చిత్ర ఓవర్సీస్ హక్కులు నలభై ఐదు లక్షలకు ఈ చిత్రాన్ని అమ్మినట్లు సమాచారం.

అదే విధంగా ఆంధ్రాలోని ఏరియా వైజ్ బిజనెస్ కూడా మంచి రేటు పలుకుతోందని తెలుస్తోంది. ఇది నిర్మాతకు మంచి ఆనందం కలిగించే విషయం. పవన్ కళ్యాణ్,వెంకటేష్ వంటి స్టార్స్ ని డైరక్ట్ చేసిన బీమినేని తొలిసారిగా అల్లరి నరేష్ ని డైరక్ట్ చేసి బిజినెస్ కు హైప్ తెచ్చారు. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల చేయనున్నారు. పాటలు ఈ నెలలో నే విడుదల చేస్తారు. 'సుడిగాడు'కి ట్యాగ్ లైన్..'ఒకే టిక్కెట్‌పై 100 సినిమాలు' అని పెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Combination of sunil and mohan babu
Jayaprada remade matrudevobhava in bhojpuri  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles