నాక్కొంచెం తిక్కుంది.. కాని దానికో లెక్కుందనే డైలాగ్ పవర్ స్టార్ నిజజీవితాన్ని బేస్ చేసుకుని వచ్చిందే.. మామూలుగా మన హీరోలలో పవన్ కల్యాణ్ ఏ విధంగా చూసినా విభిన్నమనే చెప్పాలి. వ్యక్తిగతంగానే కాకుండా... వృత్తిపరంగా కూడా ఆయన డిఫరెంటే! తన చిత్రాలలో అశ్లీలాన్నీ, డబుల్ మీనింగ్ డైలాగుల్నీ ఆయన ప్రోత్సహించడు. హీరోయిన్ ని పరిమితికి మించి ఎక్స్ పోజ్ చేయడాన్ని కూడా అంగీకరించడు. అందుకే, ఫ్యామిలీ హీరోగా కూడా ఆయన రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న 'కెమెరామేన్ గంగతో రాంబాబు' సినిమా గురించి టాలీవుడ్ లో ఓ ఆసక్తికరమైన విషయం ప్రచారంలోకి వచ్చింది. మామూలుగా పూరీ సినిమాల్లో కాస్త శృంగారం పాలు, డబుల్ మీనింగుల హడావిడి ఎక్కువగా వుంటుంది. అందుకే, ఈ సినిమాలో అలాంటివేవీ ఉండడానికి వీల్లేదంటూ పవన్ మొదట్లోనే పూరీకి గట్టిగా చెప్పాడనీ, అందుకు అనుగుణంగానే స్క్రిప్ట్ ను పూరీ తయారుచేశాడనీ అంటున్నారు. ఈ విషయంలో పవన్ చాలా నిక్కచ్చిగా ఉన్నాడట. అవసరమైన చోట్ల కొన్ని డైలాగులు మార్పులు చేయిస్తున్నాడని కూడా చెప్పుకుంటున్నారు. ఏమైనా, ఈ విషయంలో పవన్ కల్యాణ్ అభినందనీయుడనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ రూటు నేషనల్ హైవే కదా....
అంతేకాదు.. తాజాగా మరో విశేష మేమంటే.. ప్రస్తుతం పవర్ స్టార్ కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్ర షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.. రెండురోజుల క్రితం షూటింగ్ జరిగే ప్రాంతానికి పవన్ అభిమానులంతా ఒకేసారి ఎగబడ్డారంట. ఫలితంగా చిత్ర షూటింగ్ కు అంతరాయం కలిగిందట. దీంతో ఈ నష్ట పరిహారాన్ని పవన్ తన మీద వేసుకున్నాడని సమాచారం. షూటింగ్ కు అంతరాయం ఏర్పడ కుండా చూసుకోవాల్సిన బాధ్యత నిర్మాత పరిధిలోనిదే అయినప్పటికీ పవన్ ఇలా ప్రవర్తించటం నిర్మాత దానయ్యకు యమ ఖుషీ అయిపోయిందట.
ఇదిలా ఉంటే... దక్షిణాదికి సంబంధించిన సినిమాలను ... వాటి విజయాలను బాలీవుడ్ అగ్ర కథానాయకులు ఓ కంట గమనిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ ని సాధించి పెట్టిన సినిమాలు, రీమేకులుగా అక్కడ ఘన విజయాల జాబితాలోకి చేరిపోతున్నాయి. హిట్ అవుతుందా? లేదా? అనే టెన్షన్ పెద్దగా ఉండకపోవడం ... సమయం కూడా కలిసి రావడంతో ఇప్పుడంతా ఈ వైపే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఈ వరుసలో సల్మాన్ ఖాన్ ముందు వరుసలో కనిపిస్తున్నాడు. నిన్న మొన్నటి వరకూ ఓ సినిమా హిట్ అయితేనే ఆ సినిమా రీమేక్ రైట్స్ గురించి ఆలోచించే సల్మాన్, 'ప్రస్తుతం తెర కెక్కుతోన్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రానికి సంబంధించిన రీమేక్ రైట్స్ ని ముందుగానే దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడట. 'గబ్బర్ సింగ్' వంటి సంచలన విజయం తరువాత పవన్ అంగీకరించిన సినిమా అంటే, అందులో ఏదో విషయం ఉండే ఉంటుందని సల్మాన్ భావిస్తున్నాడని అంటున్నారు. పవన్ కళ్యాన్ పై ఉన్న విపరీతమైన నమ్మకం వల్ల, విడుదలకి ముందే ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం సల్మాన్ ట్రై చేస్తున్నాడనే వార్తలు ఫిల్మ్ నగర్లో షికార్లు చేస్తున్నాయి.
..avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more