Super star krishna new movie coming soon

super star krishna new movie coming soon

super star krishna new movie coming soon

13.gif

Posted: 05/09/2012 01:42 PM IST
Super star krishna new movie coming soon

        సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకు శుభవార్త. త్వరలో ఆయన మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'హరి ఓం' అనే చిత్రంలో ఆయన ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.  జయలక్ష్మీ పతాకంపై రమణ్ లోక్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.kri_in ఈది సురేష్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో శేఖర్ - నిషా కొఠారి నాయికా నాయకులుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, క్రికెట్ బెట్టింగ్ బుకీలు ... హార్స్ రైడింగ్ బుకీల నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుందని చెప్పారు. ఈ అంశానికి ప్రేమకథ కూడా ముడిపడి ఉంటుందని అన్నారు. ముఖ్యంగా ఈ సినిమాకి కృష్ణ పాత్ర వెన్నెముకగా నిలుస్తుందని వెల్లడించారు. ఈ సినిమాకి సంబంధించిన ఆడియోని వచ్చే వారంలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నామనీ ... సినిమాని జూన్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. చాలా కాలం గా సూపర్ స్టార్ ని సరికొత్త గా వెండితెరపై చూడాలన్న కోరిక నెరవేరబోతోందన్న మాట.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Once again pawan kalyan and iliyana combination
Daggu bati rana in department movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles