హిల్లరి గెలుపు అంచనాలు.. లాభాల్లో మార్కెట్లు Sensex Rises Over 100 Points Ahead Of US Presidential Vote

Sensex builds on gains surges 142 points ahead of us election

Sensex, sensex bse, sensex today, sensex today india, sensex today closing, sensex share price, sensex shares, sensex gainer and losers, sensex graph, nifty, nifty top gainers, nifty top 50, bse sensex, bse nse, global markets, Asian markets, BSE, NSE

Sensex gained 132.15 points to close at 27,591.14. Despite the latest polls suggesting an advantage for Democrat candidate Hillary Clinton over her Republican rival Donald Trump.

హిల్లరి గెలుపు అంచనాలు.. లాభాల్లో మార్కెట్లు

Posted: 11/08/2016 05:38 PM IST
Sensex builds on gains surges 142 points ahead of us election

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభల్లో పయనించాయి. బీఎస్సీ సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా లభాలన్ని అర్జించగా, అటు నిఫ్టీ కూడా 45 పాయింట్ల మేర లాభాన్ని అర్జింజి కీలమైన 8550 మార్కుకు చేరువలో నిలిచింది. అగ్రరాజ్య అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డెమెక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలుస్తారన్న తుది అంచాల నేపథ్యంలో మదుపురులు సానుకూలంగా స్పందించి.. పెట్టుబడులకు సుముఖంగా మొగ్గుచూపడంతో మార్కెట్లు లాభాలలో ముగిశాయి.

ఉదయం మార్కట్లు ప్రారంభం నుంచే దేశీయ సూచీలు లాభాల బాటలో పయనించాయి. మార్కెట్లు ప్రారంభం కాగానే నిన్నటి క్లోజింగ్ తో పోల్చగా సెన్సెక్స్ 90 పాయింట్ల వరకు నిఫ్టీ 26 పాయింట్ల లభంతో ట్రేడింగ్ సాగించాయి. ఇక ముగింపు సమయానికి సెన్సెక్స్ మరిన్ని లాభాలను ఒడిసిపట్టుకుని 132 పాయింట్లు నష్టపోయి 27 వేల 591 పాయింట్ల వద్దకు చేరుకోగా, అటు నిఫ్టీ కూడా 45 పాయింట్లకు పైగా లాభపడి 8వేల 542 పాయింట్ల వద్ద ముగిసి.. కీలకమైన 8550 మార్కుకు వద్దకు చేరుకుంది.

ఈ నేపథ్యంలో అటో, బ్యాంకింగ్, అయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్ నిఫ్టీ రంగ సూచీలు అధిక లాభాలను అర్జించగా, క్యాపిట్ గూడ్స్, చిన్నతరహా, మధ్య తరహ, మెటల్స్,  కన్జూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, టెక్నాలజీ షేర్లు కూడా స్వల్పంగా లాభాల్లో దూసుకెళ్లాయి. ఎంఎంజీసీ స్వల్ప నష్టాలను మూటగట్టుకోగా, హెల్త్ కేర్ అథ్యధిక నష్టాలలో కూరుకుపోయింది. ఈ క్రమంలో టాటా మోటార్స్, టాటా మోటార్స్ డీజిల్, గెయిల్, బిహెచ్ఇఎల్, టెక్ మహీంద్రా తదితర సంస్థల సూచీలు అధిక లాభాలను ఆర్జించగా, సన్ ఫార్మా, సిప్లా, అరబిందో ఫార్మ, టాటా పవర్, అదాని పోర్ట్స్ తదితర సంస్థల షేర్లు నష్టాల్లో కూరుకుపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  nse  bse  stock market  global markets  business  

Other Articles