మోదీ, ట్రంఫ్ ఎఫెక్ట్: కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. Sensex Ends Lower But Recovers 1,350 Points After Trump's Win

Sensex ends 339 points down on black money measures trump win

Rs500 Notes, Rs1000 Notes, donald trump,.hillary clinton, US presidential elections, Sensex, sensex bse, sensex today, sensex today india, sensex today closing, sensex share price, sensex shares, sensex gainer and losers, sensex graph, nifty, nifty top gainers, nifty top 50, bse sensex, bse nse, global markets, Asian markets, BSE, NSE

The Sensex staged a strong recovery in afternoon trade after the US election uncertainty ended with Republican Donald Trump's win.

మోదీ, ట్రంఫ్ ఎఫెక్ట్: కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు..

Posted: 11/09/2016 06:18 PM IST
Sensex ends 339 points down on black money measures trump win

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ మహా పతనావస్థ నుంచి క్రమంగా కోలుకున్నా.. చివరకు నష్టాలలోనే ముగిసాయి. ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న సంచలన నిర్ణయంతో పాటు అటు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ గెలుపొందడంతో మార్కెట్లు పతనం అంచులకు జారాయి. నల్లధనంపై సర్జికల్ స్ట్రైక్స్ గా పేర్కొంటూ ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్లు తీసుకున్న నిర్ణయం మదుపరులకు రుచించకపోవడంతో దేశీయ సూచీలపై దాని ప్రబావం వడి ఫలితంగా మార్కెట్లు కుప్పకూలీపోయాయి.

ఉదయం ప్రారంభంతోనే మార్కెట్లు కుదేలయ్యాయి. సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా పతనం కాగా, నిఫ్టీ కూడా 339 పాయింట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. ఆ తరువాత మధ్యహ్నం సమయానికి క్రమంగా కొలుకున్న మార్కెట్లు మహాపతనం నుంచి తేప్పరిల్లాయి. అయితే చివరకు నష్టాలు మాత్రం దేశీయ సూచీలను వీడలేదు. ముగింపు సమయానికి సెన్సెక్స్ 339 పాయింట్ల నష్టంతో 27, 253 మార్కు వద్ద ముగియగా, అటు నిఫ్టీ కూడా 112 నష్టంతో 8,432 పాయింట్ల వద్దకు జారుకుంది. దీంతో కీలకమైన 8450 మార్కుకు దిగువన నిఫ్టీ చేరుకుంది.

ఈ నేపథ్యంలో అటో, కన్జూమర్ డ్యూరబుల్స్, ఐటీ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల సమాఖ్యలతో పాటు ఎఫ్ఎంజీసీ, టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్, మెటల్స్ సూచీలు భారీగా నష్టపోయాయి. హెల్త్ కేర్ అత్యధిక లాభాలను అర్జించింది. కాగా, బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ, అయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. ఈ క్రమంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సన్ ఫార్మ, ఎస్బిఐ, పవర్ గ్రిడ్ కార్ప్, గెయిల్ తదితర సంస్థల సూచీలు అధిక లాభాలను ఆర్జించగా, అంబుజా సిమెంట్స్, టిసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకీ, టెక్ మహీంద్రా తదితర సంస్థల షేర్లు నష్టాల్లో కూరుకుపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles