Sensex ends two-day gain as banks slide on rise in bad loans

Sensex drops most in a month as earnings weigh

sensex, nifty, indian share market, indian stock exchange, Tata Consultancy Services, infosys, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve

Sensex fell for the first time in 3 days as prospects for global stimulus dimmed and investor concerns on earnings growth resurfaced

ఉదయం అల్ టైమ్ హై.. నష్టాల్లో మార్కెట్లు

Posted: 07/21/2016 03:57 PM IST
Sensex drops most in a month as earnings weigh

దేశీయ స్టాక్ మార్కెట్ల విలువ ఇవాళ అల్ టైమ్ హైకి చేరినప్పటికీ.. సూచీలు మాత్రం నష్టాలనే ఎదుర్కోన్నాయి. నిన్న లాభాలను అర్జించి మార్కెట్లు ఇవాళ ఉదయం ప్రారంభంలోనూ లాభాలే పలుకరించినా.. వెల్లడవుతున్న సంస్థల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ముగింపులో మాత్రం నష్టాలను మూటగట్టుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 205.37 పాయింట్ల నష్టంతో 27,710 వద్ద, నిఫ్టీ 55.75 పాయింట్ల నష్టంతో 8,510 దగ్గర ముగిసింది. కంపెనీలు ప్రకటిస్తున్న నిరాశజనకమైన తొలి త్రైమాసిక ఫలితాలు, బ్యాంకు స్టాక్స్ లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి,  స్టాక్ మార్కెట్లు నష్టాలను నమోదుచేశాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బ్యాంకు నిఫ్టీ నష్టాల బాట పట్టింది. బ్యాంకులు లాభాల్లో అదరగొట్టినప్పటికీ, బ్యాంకుకు ఉన్న మొండిబకాయిల బెడదతో షేర్లు పతనమయ్యాయి.

ఇదిలావుండగా బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజీ(బీఎస్‌ఈ) లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. ఇవాళ్టి ట్రేడింగ్ లో మార్కెట్ క్యాపిటలైజేషన్(ఎమ్-క్యాప్) రూ.107 లక్షల కోట్లకు ఎగబాకింది. 2015 ఏప్రిల్ లో 106.85లక్షల కోట్ల రికార్డును ఇవాళ్టి ట్రేడింగ్ బద్దలు కొట్టింది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్ మొదటిసారి 2014 నవంబర్ లో రూ.100లక్షల కోట్ల రికార్డును ఛేదించింది. మార్కెట్ విలువలో ఆల్ టైమ్ రికార్డులను తాకుతూ ప్రపంచంలోని టాప్-10 ఎక్స్చేంజీలలో ఒకటిగా బీఎస్ఈ ఆవిర్భవించింది. మరోవైపు లిస్టయిన కంపెనీల సంఖ్యా రీత్యా కూడా టాప్ ర్యాంకులో కొనసాగుతుంది. ప్రస్తుతం 2,400కు పైగా కంపెనీలు బీఎస్ఈలో ట్రేడ్ అవుతున్నాయి. కొత్త కంపెనీల లిస్టింగ్ ల జోరు కొనసాగుతుండటంతో, బీఎస్ఈలో మార్కెట్ క్యాపిలైజేషన్ యేటికేటికి పెరుగుతోంది.

ఇవాళ్లి ట్రేడింగ్ అటో, ఐటీ రంగాలకు చెందిన సూచీలు స్వల్ప లాభాలను అర్జించగా, మిగిలిన అన్ని సూచీలు నష్టాలను ఎదుర్కోన్నాయి. అయిల్ అండ్ గ్యాస్, కన్జూమర్ డ్యూరబుల్స్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్,  క్యాపిటల్ గూడ్స్ చెందిన సూచీలు భారీ నష్టాలను ఎదుర్కోగా, బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ, ఎఫ్ఎంజీసీ, హెల్త్ కేర్, టెక్నాలజీ చిన్నతరహా పరిశ్రమల సమాఖ్య, మద్యతరహా పరిశ్రమాల సమాఖ్యల సూచీలు కూడా నష్టాలను ఎదుర్కోన్నాయి. ఈ నేపథ్యంలోఅదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, భారతీ ఎయిర్ టెల్, ఏషియన్ పేయింట్స్, విప్రో తదితర సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, యాక్సిస్ బ్యాంకు, బీహెచ్ఈఎల్, ఐసీఐసీఐ, ఎస్ బీఐ, ఎమ్ అడ్ ఎమ్ తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles