Sensex scores more, rallies 181 points, Nifty tops 8500

Sensex nifty end higher on global cues

sensex, nifty, indian share market, indian stock exchange, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve

The Sensex and the Nifty hovered in positive zone throughout the trading session after opening with upward gap. The Sensex and Nifty hit its highest closing level in almost eleven months.

11 నెలల గరిష్ట స్థాయికి సూచీలు.. 8500 మార్కుకు ఎగువన నిఫ్టీ..

Posted: 07/12/2016 05:56 PM IST
Sensex nifty end higher on global cues

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలను గడించాయి. విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాల నేపథ్యంలో ముఖ్యంగా అసియా మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ పవనాలను అందుకున్న మార్కెట్లు లాభాలను అర్జించాయి. లాభాలను అదిమి పట్టుకోవడంలో సఫలమైన మార్కెట్లు 11 నెలల గరిష్టస్థాయికి చేరకున్నాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెస్సెక్స్ 27 వేల 800 మార్కెకు ఎగువన ముగియగా, అటు నిఫ్టీ కూడా ప్రతిష్టాత్మక 8500 మార్కుకు ఎగువన ముగిసింది.  

ఇవాళ ఉదయం మార్కెట్లు ప్రారంభంతోనే లాభాలను అర్జించాయి. ఉదయం సెన్సెక్స్ 74 పాయింట్ల లాభంతో 27, 699 దగ్గర, నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 8489 దగ్గర ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్, ఆటోమొబైల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల్లో కొనుగోళ్ల ట్రెండ్ నెలకొంది. లాభాలను అధిమిపట్టుకున్న మార్కెట్లు ముగింపు సమయానికి కూడా లాభాల ట్రెండ్ ను  కొనసాగించాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్, 28 వేల 808 మార్కుకు వద్ద ముగియగా, అటు నిఫ్టీ కూడా 8750 మార్కుకు ఎగువన 8521 మార్కుకు వద్ద ముగిసింది.

ఇవాళ్లి ట్రేడింగ్ లో మొత్తంగా 2893 సంస్థలకు చెందిన షేర్లు ట్రేడింగ్ లో పాల్గోనగా, 1522 సంస్థలకు చెందిన షేర్లు లాభాలను అర్జించగా, 1237 సంస్థలకు చెందిన షేర్లు నష్టాలను చవిచూశాయి. కాగా 134 సంస్థల షేర్లు తటస్థంగా వున్నాయి. ఈ క్రమంలో ఎఫ్ఎంజీసీ, హెల్త్ కేర్, ఐటీ సంస్థల సూచీలు స్వల్ప నష్టాలను నమోదు చేసుకున్నాయి. బీఎస్ఈ బ్యాకింగ్ బ్యాంకింగ్ నిష్టీ మెటల్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, భారీ లాభాలను అర్జించగా, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల సూచీలు, క్యాపిటల్ గూడ్స్, అయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, టెక్నాలజీ సూచీలకు చెందిన సంస్థల షేర్లు లాభాలను గడించాయి. ఈ నేపథ్యంలో హిండాల్కో, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకీ తదితర తదితర సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, టాటా పవర్, సిప్లా, కోల్ ఇండియా, బిపిసిఎల్, అరబిందో ఫార్మా తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles