Sensex regains 27K-mark on RBI's accomodative stance

Sensex ends higher as rbi leaves rates unchanged

sensex, nifty, indian share market, indian stock exchange, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve chairperson

The BSE Sensex and NSE Nifty closed Tuesday's session in positive terrain after Reserve Bank of India (RBI) kept key policy rates unchanged

అర్బీఐ ద్రవ్యపరపతిలో మార్పుల నిల్.. మార్కెట్లు లాభాలు ఫుల్..

Posted: 06/07/2016 09:22 PM IST
Sensex ends higher as rbi leaves rates unchanged

మార్కెట్ విశ్లేషకులు, ఆర్థిక వేత్తలు ముందుగా ఊహించిన మాదిరిగానే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా నిర్ణయం వెలువరించడంతో, మార్కెట్లలో ఎలాంటి కదలికలు కనిపించలేదు. సాధారణంగానే సెన్సెక్స్, నిఫ్టీలు కదలాడుతున్నాయి. సెన్సెక్స్ 82.99 పాయింట్ల లాభంతో, 26,860 వద్ద, నిఫ్టీ 24.65 లాభంతో 8,225 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

ఇవాళ  జరిగిన ద్రవ్యవిధాన పరపతి సమీక్షలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ రెపోను 6.50శాతం, సీఆర్ఆర్ 4 శాతంగానే ఉంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాజన్ నిర్ణయం స్టాక్ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపలేదు. కేవలం భవిష్యత్ లో రేట్లు ఎలా ఉండబోతున్నాయో అనే ప్రకటనపైనే దలాల్ స్ట్రీట్ దృష్టిసారించింది.

దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 232 పాయింట్లు లాభపడి 27,010 వద్ద ముగియగా, నిఫ్టీ 65 పాయింట్లు లాభపడి 8,266 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో ఎస్బీఐ సంస్థ షేర్లు అత్యధికంగా 5.66 శాతం లాభపడి రూ.210.15 వద్ద ముగిశాయి. వీటితోపాటు ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెడ్ సిమెంట్, హిందాల్కో, అంబుజా సిమెంట్స్ సంస్థల షేర్లు లాభపడ్డాయి. బీపీసీఎల్ సంస్థల షేర్లు అత్యధికంగా 1.91 శాతం నష్టపోయి రూ.975.30 వద్ద ముగిశాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా పవర్, అరబిందో ఫార్మా, ఇన్ఫోసిస్ సంస్థల షేర్లు నష్టాలతో ముగిశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles