Sensex drops most in 2 weeks, Nifty holds 8200 ahead of RBI policy

Nifty ends at 8201 sensex in red ahead of rbi policy

sensex, nifty, indian share market, indian stock exchange, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve chairperson

After a lot of struggles and sluggishness, the market has ended in red. The Nifty closed tad above 8200, down 19.75 points or 0.2 percent at 8201.05 and the Sensex slipped 65.58 points or 0.2 percent at 26777.45.

అర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష.. నష్టాల్లో మార్కెట్లు

Posted: 06/06/2016 07:58 PM IST
Nifty ends at 8201 sensex in red ahead of rbi policy

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలను ఎదుర్కోన్నాయి. భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్యపరపతి విధానాన్ని సమీక్షించనున్న నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కట్లు ఇవాళ నష్టాలను ఎదుర్కోన్నాయి. మంగళవారం అర్బీఐ గవర్నర్ ద్రవ్యపరపతి విధానంపై సమీక్షించనున్నారు. దీంతో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేకుండా తటస్థంగానే వుండవచ్చునన్న వార్తల నేపథ్యంలో ఉదయం లాభాలను స్వీకరించిన మార్కెట్లు సాయంత్రం ముగింపు సమయానికి నష్టాలను మూటగట్టుకున్నాయి. అన్ని సెషెన్లలో మార్కెట్లు భారీగా కుదుపులకు లోనయ్యాయి.

మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 66 పాయింట్ల నష్టంతో 26 వేల 777 పాయింట్ల వద్దకు చేరుకుంది. నిఫ్టీ కూడా 20 పాయింట్ల నషంతో 8 వేల 201 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది, కాగా ఇవాళ ఉదయం నుంచి దేశీయ సూచీలు అటుపోట్లను ఎదుర్కోని కుదుపులకు గురవుతున్నాయి. ఇవాళ మొత్తంగా 2,771 కంపెనీల షేర్లు ట్రేడింగ్ లో పాల్గొనగా, 1,178 కంపెనీల షేర్లు లాభాలను ఆర్జించగా, 1,460 కంపెనీల షేర్లు నష్టాలను నమోదు చేశాయి. కాగా 133 కంపెనీల షేర్లు తటస్థంగా నిలిచాయి.

ఇవాళ్లి ట్రేడింగ్ లో క్యాపిటల్ గూడ్స్, చిన్న తరహా పరిశ్రమల సమాఖ్య, అటో, ఎఫ్ ఎం జీ సీలకు చెందిన షేర్లు లాభాలను అర్జించగా, మిగిలిన అన్ని సూచీలు నష్టాలను ఎదుర్కోన్నాయి. ముఖ్యంగా కన్జూమర్ గూడ్స్, హెల్త్ కేర్, అయిల్ అండ్ గ్యాస్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ, ఐటీ, మెటల్స్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, టెక్నాలజీ, మధ్యతరహా పరిశ్రమల సమాఖ్య సూచీలు స్వల్ప నష్టాలను మూటగట్టుకున్నాయి, ఈ నేపథ్యంలో బ్యాంక్ అప్ బరోడా, యస్ బ్యాంక్, టాటా మోటార్స్, హిండాల్కో, అల్ట్రా టెక్ సిమెంట్, తదితర సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, భారతి ఎయిర్ టెల్, భారతి ఇన్ ఫ్రాటెల్, టెక్ మహీరంద్రా, లుపిన్, యాక్సిస్ బ్యాంక్ తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.    

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles