Costlier food pushes WPI to 12-month high

Wpi index falls for 14th straight month

india inflation, india inflation rate, wholesale price index, wpi inflation, wpi, economy, december 2015 wpi inflation, Core Inflation, Crisil Core Inflation Indicator, Ccii, Economy & Policy

Though the pace of deflation has been weakening since last four months, high food prices continue to remain a cause of concern.

8 శాతానికి ఎగబాకిన టోకు ధరల సూచీ ద్రవ్యోల్భణం

Posted: 01/15/2016 06:32 PM IST
Wpi index falls for 14th straight month

టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 14వ నెలలోనూ క్షీణించింది. డిసెంబర్ మాసంలో టోకు దరల సూచీ అసలు పెరక్కపోగా... -0.73 శాతంగా నమోదయ్యి మైనస్ లో కొనసాగి పన్నెండు నెలల కనిష్టస్థాయికి చేరింది. అంతకుముందు ఏడాది డిసెంబర్‌తో పోల్చితే.. గత ఏడాది డిసెంబర్‌లో టోకు బాస్కెట్ రేటు మైనస్ లో కోనసాగి ద్రవ్యోల్భణం ప్రతపాన్ని ప్రజలపై చూపింది. గత ఏడాది నవంబర్‌లో ఈ రేటు -1.99 శాతంగా నమోదైయ్యింది. అయితే మొత్తం టోకు ధరల సూచీలో ఒక భాగమైన ఆహార ధరల విభాగం మాత్రం సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న వైనాన్ని గణాంకాలు ప్రతిబింబించాయి. ఈ ధరల స్పీడ్ డిసెంబర్‌లో ఏకంగా 8.17 శాతంగా నమోదయ్యింది.  గడచిన ఏడాది కాలంలో పెరుగుదల ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి.
 
ఆహార ఉత్పత్తుల ధరలు భారీగా పెరగడం దీనికి కారణం. ఆహార ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే... రానున్న కొద్ది నెలల్లో సూచీ మొత్తం క్షీణతలోంచి బయటకు వస్తుందని అంచనా. 2014 నవంబర్ నుంచి క్షీణతలో కొనసాగుతున్న టోకు ద్రవ్యోల్బణం... ఆహార ధరల తీవ్రత దృష్ట్యా గడచిన నాలుగు నెలల నుంచి కొంచెంకొంచెంగా పైకి వస్తోంది. ఆహార, ఆహారేతర ఉత్పత్తులతో కూడిన ఈ విభాగంలో రేటు 5.48% పెరిగింది. ఇందులో ఒక్క ఆహార ఉత్పత్తులను చూస్తే ఈ రేటు 8.17 శాతంగా ఉంది. నవంబర్‌లో ఈ రేటు 5.2%. పప్పు దినుసుల ధరలు వార్షికంగా చూస్తే... భారీగా 56% ఎగశాయి. ఉల్లి ధరలు 26% అధికంగా ఉన్నాయి. కూరగాయల ధరలు 21 శాతం ఎగశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Wholesale Price Index  Wpi  inflation  

Other Articles