Stocks close at over one-and-a-half-year lows

Stocks close at over one and a half year lows

stock market, stocks, Nifty, Sensex, TCS, Mumbai, Dalal street, Share Market

Equities failed to safeguard early gains, ending lower for the sixth time in seven sessions as the BSE Sensex slipped by 143 points to 24,682.03—its lowest closing in more than 19 months—on caution ahead of key macroeconomic data and quarterly numbers of IT major Tata Consultancy Services Ltd (TCS).

ఏడాదిన్నర కనిష్టానికి స్టాక్ మార్కెట్లు

Posted: 01/12/2016 06:25 PM IST
Stocks close at over one and a half year lows

అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, చైనా మార్కెట్ల పతనం కారణంగా భారత స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. దాదాపు ఏడాదిన్నర తర్వాత భారత స్టాక్ మార్కెట్ కనిష్ట స్థాయికి పడిపోయింది. చైనా మార్కెట్ తో పాటు దేశీయ మైక్రె ఎకానమీ డైటా, టీసీఎస్ ఫలితాలు ఎలా ఉంటాయో అన్న అనుమానాలు ఇలా సవాలక్ష కారణాలు భారత మార్కెట్లను కుంగదీశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 143.01 పాయింట్లు పడిపోయి 0.58 శాతం నష్టంతో 24,682.03 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 53.55 పాయింట్లు పడిపోయి 0.71 శాతం నష్టంతో 7,510.30 పాయింట్ల వద్దకు చేరాయి.

ఇక బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.94 శాతం, స్మాల్ క్యాప్ 1.03 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 14 కంపెనీలు లాభాల్లో నడిచాయి. ఎన్టీపీసీ, విప్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, హిందుస్థాన్ యూనీలివర్ తదితర కంపెనీలు లాభపడగా, ఐడియా, పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందాల్కో తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 96,39,248 కోట్లకు చేరింది. బీఎస్ఈలో మొత్తం 2,944 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 930 కంపెనీలు లాభాలను, 1,857 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : stock market  stocks  Nifty  Sensex  TCS  Mumbai  Dalal street  Share Market  

Other Articles