Infosys shares hit 3 month high post q1 results

Infosys shares,Infosys Q1 results,Infosys Q1 revenue,Infosys Q1 guidance,Rupee,Infosys,BSE

Shares of IT bellwether Infosys rallied 15% to hit its fresh 3-month high, its highest level since May 31.

క్యూ1 ఫలితాలు అదరగొట్టాయి

Posted: 07/13/2013 02:42 PM IST
Infosys shares hit 3 month high post q1 results

దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మెరుగైన ఫలితాలతో బోణీ కొట్టింది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం(2013-14, క్యూ1)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.2,374 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలానికి రూ.2,289 కోట్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన లాభం 3.7 శాతం వృద్ధి చెందింది. అయితే, మార్చి క్వార్టర్‌లో రూ.2,394 కోట్ల లాభంతో పోలిస్తే త్రైమాసిక ప్రాతిపదికన దాదాపు ఒక శాతం తగ్గుదల నమోదైంది. కాగా, ఇన్ఫీ కన్సాలిడేటెడ్ ఆదాయం క్యూ1లో రూ.11,267 కోట్లకు పెరిగింది. వార్షికంగా 17 శాతం, త్రైమాసికంగా 8 శాతం చొప్పున వృద్ధి చెందింది. పలు బ్రోకరేజి కంపెనీల విశ్లేషకులు సగటున రూ.2,315 కోట్ల నికర లాభం, రూ.11,029 కోట్ల ఆదాయం ఉండొచ్చని అంచనా వేశారు. దీన్ని మించి ఫలితాలు వెలువడటం మార్కెట్ వర్గాలను మెప్పించింది.

ఫలితాలు అంచనాలను మించడం, ఆదాయ గెడైన్స్‌లో ఎలాంటి కోతా లేకపోవడంతో మార్కెట్లో శుక్రవారం ఇన్ఫోసిస్ షేర్లకు డిమాండ్ జోరందుకుంది. దీంతో బీఎస్‌ఈలో ఇన్ఫీ షేరు ధర క్రితం ముగింపు రూ.2,527తో పోలిస్తే ఒకానొక దశలో 15 శాతం దూసుకెళ్లింది. రూ.2,905ను తాకింది. అయితే, చివర్లో కొంత తగ్గుముఖం పట్టింది. 11 శాతం లాభపడి రూ.2,803 వద్ద స్థిరపడింది. మార్చి క్వార్టర్ ఫలితాల సందర్భంగా ఆదాయ గెడైన్స్ నిరాశాజనకంగా ఉందన్న కారణంతో ఇన్ఫీ షేరు 20 శాతం పైగా కుప్పకూలిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles