Tcs q1 net profit up 16 percent

Software,TCS,Tata Consultancy Services,TCS Q1 earnings,April-June quarter,results,softwareservices,IT,margin,NChandrasekaran, CEO

India largest software services exporter Tata Consultancy Services first quarter consolidated net profit rose higher-than-expected 16 percent.

టీసీఎస్ ఫలితాలు భేష్

Posted: 07/19/2013 06:38 PM IST
Tcs q1 net profit up 16 percent

దేశీ ఐటీ అగ్రగామి టీసీఎస్ అంచనాలను మించిన ఫలితాలతో అదరగొట్టింది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం(2013-14, క్యూ1)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికరలాభం రూ.3,831 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో నమోదైన రూ.3,318 కోట్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన లాభం 15.5 శాతం దూసుకెళ్లింది. క్రితం క్వార్టర్(2012-13, క్యూ4)తో చూస్తే త్రైమాసికంగా 5.9 శాతం వృద్ధి నమోదైంది.

ప్రధానంగా కొత్త ఆర్డర్లు జోరందుకోవడం, ఫారెక్స్ రాబడులు పుంజుకోవడం లాభాల జోరుకు కారణమయ్యాయి. ఇక క్యూ1లో మొత్తం ఆదాయం కూడా రూ.14,869 కోట్ల నుంచి రూ.17,987 కోట్లకు ఎగసింది. వార్షిక ప్రాతిపదికన 21 శాతం పెరిగింది. ఇక త్రైమాసికంగా చూస్తే 9.5 శాతం వృద్ధి చెందింది. పలు స్టాక్ బ్రోకరేజి సంస్థల విశ్లేషకులు సగటున లాభం రూ.3,765 కోట్లు, ఆదాయం రూ.17,620 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. దీనికంటే చాలా మెరుగ్గా ఫలితాలు ప్రకటించడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles