‘Bihar ki beti’ vs Opposition’s losing strategy నితీష్ వైఖరి: అప్పుడలా.. ఇప్పుడిలా..!

Bihar ki beti vs opposition s losing strategy

lalu prasad yadav, nitish kumar, presidential polls, dalit president, ram nath kovind, congress, bjp, meira kumar, opposition candidate, nda presidential nominee, pranab mukharjee, bihar ki beti, india news

‘Bihar ki beti’ vs Opposition’s losing strategy నితీష్ వైఖరి: అప్పుడలా.. ఇప్పుడిలా..!

నితీష్ కుమార్ అధికారపక్షానికి మోకరిల్లుతున్నారా..?

Posted: 06/24/2017 01:59 PM IST
Bihar ki beti vs opposition s losing strategy

బీహార్ సీఎం నితీశ్ కుమార్ వైఖరిని అధికార పక్షానికి మోకరిల్లుతున్నట్లుగా వుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలలో బీహర్ ముఖ్యమంత్రి, జేడీయు నేత అధికార పక్షానికి చెందిన వ్యక్తికి మద్దతు పలకడమే ఇందుకు కారణం. బీహార్ కు చెందిన మాజీ దేశ ప్రధాని, బాబు జగ్జీవన్ రామ్ కుమార్తె, మాజీ లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ ను తమ అభ్యర్థిగా బరిలోకి దింపినా.. అధికార జేడీయూ మాత్రం బీహర్ అడబిడ్డను కాదని, ఆ రాష్ట్రానికి గవర్నర్ గా వున్న అధికార పక్ష అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు మద్దతు తెలపడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఈ విషయంలో బీహార్ రాష్ట్రానికి చెందిన అధికారపక్షంలోనే విభేదాలు వస్తున్నాయి. బీహర్ అడబిడ్డకు కాకుండా ఇతరుకు మద్దుతు ఎలా ఇస్తున్నారంటూ నితీష్ నిర్ణయాన్ని ఆర్జేడీ నేతలు తప్పుబడుతున్నారు. అయితే బిహార్ అడబిడ్డకు ఓటమి తప్పదని తెలిసికూడా ఎందుకు పోటీకి దింపారని జేడీయు నేతలు ప్రశ్నిస్తున్నారు. బీహార్ అడబిడ్డకు పరాభవాన్ని అంటగట్టేందుకే అమెను రంగంలోకి దింపుతున్నారా..? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీంతో అధికార పక్షంలోనే విభేధాలు తారాస్థాయికి చేరాయి.

ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అధిత్యనాథ్ బీహార్ పర్యటనకు వస్తున్న క్రమంలో వట్టి చేతులతో రావద్దని ఎద్దేవా చేసిన జేడీయూ.. కేంద్రంలో అధికారంలో వున్న మోడీ ప్రభుత్వంతో అంతర్గతంగా ఏదో ఒప్పందాన్ని చేసుకుని మద్దతు ఇస్తున్నారన్న అరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి. బీహార్ ఎన్నికలకు ముందు అధికారాన్ని అందుకోవాలని బీజేపి నేతలు.. స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ఎన్నికలు జరిగి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులను విధిల్చని కేంద్రానికి జేడీయు మద్దతు ఎలా తెలిపిందో అర్థంకాని ప్రశ్నగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే జేడీయు ప్రత్యర్థి వర్గాలు మాత్రం కేంద్రంలోని అధికార పార్టీతో జేడీయు లాలూచి పడిందని, ఏదో లాభాన్ని కాంక్షించే ఇలాంటి చర్యలకు దిగుతుందని అరోపిస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల అంశం తెరపైకి రాగానే ప్రధానిని తీవ్రంగా విమర్శించిన నితీష్.. పలు సందర్బాల్లు మోడీని కలుసుకుని.. తమ భేటీ సాధారణమేనని ప్రకటించడమే ఈ అనుమానాలకు అస్కారమిస్తుందని అంటున్నారు.

ఇలా అరోపణలు నితీష్ కుమార్ చుట్టుముడుతున్న నేపథ్యంలో వాటిని నివృత్తి చేసుకునే పనిలో స్వయంగా ఆయనే ఈ అంశాలపై క్లారిటీ ఇచ్చారు. అన్ని పార్టీలతో మాట్లాడిన తర్వాతే రాష్ట్రపతి అభ్యర్థిపై నిర్ణయం తీసుకున్నారని నితీష్ చెప్పారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి అయిన మీరాకుమార్ అంటే తనకు చాలా గౌరవమని, అయితే, రాష్ట్రపతి రేసులో ఓటమి తప్పదని తెలిసే ఆమె ముందుకు వచ్చారని అన్నారు.

గతంలో కూడా తాము, స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్నామని, ఎన్డీఏలో ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చిన విషయాన్ని నితీశ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాగా, ఇదే మాటను ముందే చెప్పివుంటే బాగుండేదని కొందరు వ్యాఖ్యానించగా, మరికొందరు మాత్రం అడబిడ్డకు ఒటేయకుండా ఒటమి తప్పదని వ్యాఖ్యానించడం నితీష్ కుమార్ కే చెల్లిందని దుయ్యబడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : presidential polls  nitish kumar  meera kumar  ramnarh kovind  bihar  

Other Articles