చారిత్రక తప్పిదం చేస్తున్న చంద్రబాబు..? chandrababu government commiting historical mistake..?

Chandrababu government commiting historical mistake

andhra pradesh, special status, special status to ap, chandrababu, vishakapatnam, vizag, RK beach, silent protest, jana sena, pawan kalyan, YSRCP, ys jagan, congress

Insteaf of demanding the central government for the election promise of andhra pradesh special status, chandrababu government commiting historical mistake by supressing the protesters.

చారిత్రక తప్పిదం చేస్తున్న చంద్రబాబు..?

Posted: 01/30/2017 09:43 PM IST
Chandrababu government commiting historical mistake

నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోమారు చారిత్రక తప్పిదం చేస్తున్నారా..? గతంలో కేంద్రంలో చక్రం తిప్పిన ఆయన ఇప్పుడెందుకు అలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవడం లేదు.? మరో ఏడాదో, ఏడాదిన్నరకో అవకాశాలను అందిపుచ్చుకున్నా రాష్ట్ర ప్రజలను అయనను విశ్వసిస్తారా..? అసలు ఆయన పార్టీని తరువాత వచ్చే ఎన్నికలలో అదరిస్తారా..? ఒక్క దెబ్బకు ఐదు కోట్ల మంది అంధ్రులకు మాస్, క్లాస్ లీడర్ గా ఎదిగే అవకాశాన్ని బాబు నిజంగానే జారవిడుచుకున్నారా..? అంధ్రుల మనోభావాలను, సెంటిమెంట్లను గౌరవించకుండా ఒంటెద్దు పోకడలకు ఎందుకు పూనుకుంటున్నారు..?. ఇవి ఇప్పుడు తెలుగువారిలో ముఖ్యంగా నవ్యాంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉత్పన్నమౌవుతున్న ప్రశ్నలు.

సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ ను అభివృద్ది చేసింది తానేనని, తనకు అవకామిస్తే రాజధాని లేని నవ్యాంధ్రప్రదేశ్ లో అత్యంత అధునాతమైన రాజధానిని నిర్మిస్తానని చెప్పడంతో ప్రజలుచ్చిన అవకాశాన్ని ఆయన అందిపుచ్చుకున్నట్లు లేరని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, ఇక దీనికి తోడు కేంద్రంలో బీజేపి ప్రభుత్వం వస్తుందని మోడీ మానియా చూసిన ప్రజలు అయనతో చంద్రబాబుకు గత కొన్నేళ్లుగా వున్న సన్నిహిత్యాన్ని దృష్టిలో పెట్టుకున్న ఏపీ వాసులు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటూ టీడీపీకి వస్తేనే అవుతుందని విశ్వసించి చంద్రబాబుకు సీఎం పీఠాన్ని ఎక్కేలా అవకాశాన్ని ఇచ్చారు.

అయితే చంద్రాబాు కూడా అటు మోడీ తో పాటు ఇటు వెంకయ్య నాయుడులను వెంటబెట్టుకుని రాష్ట్రంలోని నలుమూలలా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ.. కష్టాల కడలిలో వున్న నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పిస్తామని కూడా హామి ఇచ్చారు. ఇక రాష్ట్ర పునర్విభజన సమయంలో రాజ్యసభలో వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా విషయం అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకోచ్చిన బిల్లును వ్యతిరేకించి.. ఏపీ ప్రజల పాలిట హీరోగా మారారు. ఆ విషయాన్ని పూర్తిగా గమనించిన ఏపీవాసులు వెంకయ్య, మోడీలతో కలసి ఏపీకి హోదాను చంద్రబాబు తీసుకువస్తారని విశ్వసించారు.

వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తరువాత కూడా చంద్రబాబుపై ఎక్కడో ఆంధ్రప్రదేశ్ వాసులకు వ్యతిరేకత వుంది. అదే సమయంలో ఆయన కాంగ్రెస్ పై చేసిన విమర్శలను కూడా ఏపీ వాసులు బలంగానే నమ్మారు. అందుకనే కాంగ్రెస్ కు ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా కట్టబెట్టని ఓటర్లు.. చంద్రబాబును కూడా పూర్తిగా నమ్మినట్లు లేరు. అప్పటికి నవ్యాంధ్రప్రదేశ్, సమైక్యాంధ్రప్రదేశ్ లలో తొలిసారిగా పూర్తిస్థాయిలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోంటున్న వైసీపీ పక్షాన నిలిచారు. జగన్ మాటలను నమ్మడం కన్నా ఏపీ వాసులు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పథకాలకు అకర్షితులయ్యారు, ఆ పథకాలు కొనసాగాలంటూ జగన్ రావాలని కోరుకున్నారు.

కానీ జగన్ అశలపై నీళ్లు చల్లడంతో పాటు ఇటు తీవ్ర ఉత్కంఠలో వుండి అందోళన చెందుతున్న టీడీపీకి కొత్తగా వచ్చిన పార్టీ జీవం పోసింది. అంపశయ్యపై వున్న పార్టీకి అక్సిజన్ ఇచ్చి కేవలం ఆరు లక్షల ఓట్లతో టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకోచ్చారు జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్. ఈ విషయంలో బాగా అర్థం చేసుకున్న టీడీపీ నేతలు  అప్పడప్పుడు పవన్ పై నోరు జారినా.. పార్టీ అధినేత చంద్రబాబు అదేశాల మేరకు విమర్శలను అపేశారు. జనసేన మనకు మిత్రపక్షం అని చెప్పడంతో నేతలు పవన్ అంటే మాకు గౌరవం వుంది అంటూ తమ దోరణి మార్చారు.

అటు మోడీ ప్రభుత్వం, ఇటు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిన తరువాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం గళమెత్తారు జనసేన అధినేత.. అంతే అక్కడి నుంచి ఆయన ఎలాంటి స్వార్థం లేకుండా కేవలం రాష్ట్రానికి ప్రత్యేక హాదో రావాలని, ఇస్తారన్న అశల నేపథ్యంలో అటు బీజేపి, ఇటు టీడీపీలను అధికారంలోకి తీసుకోచ్చిన పవన్ కల్యాన్ పై టీడీపీ నేతలు విమర్శల పర్వం మెదలు పెట్టారు. ఇక హోదా అనేది ముగిసిన అద్యాయమని, అంతకన్నా అధికంగా ప్యాకేజీ ప్రకటిస్తామని అర్థరాత్రి హైడ్రామా మద్య రాష్ట్రానికి గతంలో ఇస్తామన్న నిధులతోనే ప్యాకేజీని ప్రకటించారు.

అర్థరాత్రి హైడ్రామా మధ్య యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని విడగోట్టిదని, కనీసం అస్తులను కూడా సక్రమంగా పంచకుండా ఇష్టానుసారం విడగోట్టారని ఎన్నికల ప్రచారంలో ఊదరగోట్టిన చంద్రబాబు.. అదే అర్థరాత్రి హైడ్రామా మధ్య ప్రధాని విదేశాల్లో పర్యటిస్తున్న సమయంలో ప్యాకేజీపై హడావిడి చేసి కొత్త సీసాలో పాత మందు అన్నట్లుగా ప్యాకేజీని ప్రకటింపజేశారు. ఇక అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఏకంగా మీడియా ముందుకు వచ్చిన చంద్రబాబు.. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి ఆఘమేఘాల మీద ధన్యవాదాలు తెలిపారు. ఇక ఇప్పుడు దానికి చట్టబద్దత తీసుకువస్తామని నమ్మబలుకుతున్నారు.

అయితే నవ్యాంధ్ర ప్రజలు మాత్రం చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. చంద్రబాబునాయుడు చాణక్య రాజనీతి గురించి పరిచయం వున్నవారు మాత్రం అతడిపై విమర్శలు గుప్పింస్తున్నారు. స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీరామారావును పదవీచ్యుతుడిని చేసి చంద్రబాబు సీఎం పీఠాన్ని అధిరోహించిన తరువాత ముందుగా కేంద్రంలో వామపక్షాలతో నేతృత్వంలోని యూనైటెడ్ ఫ్రంట్ లో చక్రం తిప్పిన ఆయన ఆ తరువాత కేంద్రంలో అటల్ బిహారీ వాజ్ పాయ్ ప్రధానిగా కోనసాగిన హయాంలో మరోమారు ఆయన చక్రం తిప్పారు.

అయితే ఆ తరువాత ఎన్నికలలో పరాజయం పాలైన టీడీపీ పార్టీ పరాజయాన్ని తలకెత్తుకున్న ఆయన బీజేపి నేతృత్వంలోని ప్రభుత్వంలో కొనసాగి తాను చారిత్రక తప్పిదం చేశానని చెప్పుకోచ్చారు. అందుచేత రాష్ట్రంలోని మైనారిటీలకు తన పార్టీ దూరమైందని, వారి ఓట్లను తమ ఖాతాలోకి వేసుకుని కాంగ్రెస్ సహా వామపక్షాలు టీఆర్ఎస్ పార్టీల మిత్రపక్ష కూటమి అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఆ తరువాత పదేళ్ల వరకు చంద్రబాబును అధికారానికి దూరంగానే వుంచారు ఏపీవాసులు. అయితే ఇప్పడు ప్రత్యేక హోదా విషయంలోనూ చంద్రబాబు ఇదే ధోరణి అవలంభిస్తున్నారని మండిపడుతన్న రాష్ట్రవాసులు అందివచ్చిన అవకాశాన్ని కూడా ఆయన సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని విమర్శిస్తున్నారు.

నవ్యాంధ్రలో అధికారంలోకి వచ్చిన అరు నెలల నుంచి రాష్ట్రానికి ప్తత్యేక హోదా కష్టమేనన్న ప్రచారాన్ని ప్రారంభించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్వయంగా ఈ విషయాన్ని విజయవాడలో ఓ సమావేశంలో చెప్పారు. అయితే లేదు ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది అంటూ హోదాను నాన్చడం ప్రారంభమైంది. తిరుపతిలో కాంగ్రెస్ తృతీయశ్రేణి నాయకుడు మునికోటి ఆత్మహత్యతో రాష్ట్రంలో హోదా విషయమై అలజడి ప్రారంభమైంది. ఆ తరువాత ఇదే డిమాండ్ తో అనేకమంది బలవన్మరణాలకు పాల్పడ్డారు, ఆ తరుణంలో ప్రత్యేక హోదా విషయాన్ని కేంద్రం నీటి అయోగ్ కు అప్పగించిందన్నారు.

నీటి అయోగ్ నివేదిక ఇవ్వగానే దాని మేరకు నడుచుకుంటామని ఇదిగో అదిగో అంటూ మరో సంవత్సరం లాగించారు. ఇక నీటి అయోగ్ కూడా తమ వల్ల కాదని చేతులెత్తేసిన సమయంలో హోదా కావాలంటే కనీసం 15 రాష్ట్రాలు అమోదం తెలపాలన్న డిమాండ్ ను తెరపైకి తీసుకోచ్చింది కేంద్రంలోని మోదీ సర్కార్. ఈ తరుణంలో కేంద్రం నిర్ణయం పక్కాగా తెలుసుకున్న టీడీపీ ప్రభుత్వంలోని పలువురు పెద్దలు హోదా పక్కనబెట్టి కనీసం ప్యాకేజీ కోఃమైన్నా పట్టుబట్టాలని భావించి ప్రణాళిక రచించారు. అర్థరాత్రి నడిచిన హైడ్రామా అనంతరం ప్రకటించిన ప్యాకేజీలో కూడా పాత మందే వుందని తెలుసుకున్న జనం హోదా గురించి మర్చిపోయారు.

సరిగ్గా అదే సమయంలో తమిళనాడులోని సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విధించిన నిషేధాన్ని రద్దు చేయాలని డిమాండ్ తెరపైకి రావడం.. దీనిపై అప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం ప్రధానికి లేఖ రాయడం కూడా జరిగిపోయాయి. అయినా యువత మాత్రం నిరసనలు చేపట్టాలని నిర్ణయించగా, ఒక్కచోట నిరసనలు చేస్తే అందోళన శక్తి కేంద్రానికి తెలుస్తుందని భావించిన కోలీవుడ్ ప్రముఖులు మెరినా బీచ్ ను ఇందుకోసం ఎంచుకున్నారు, అంతే వందల సంఖ్యలో ప్రారంభమైన నిరసన లక్షలకు చేరింది. తమిళనాడు నిరసనలకు కేంద్రం కూడా తలవంచింది.

ఆ ఉద్యమం విజయం సాధించిన తరుణంలో ఇటు ప్రత్యేక హోదాపై కూడా శాంతియుత నిరసన తెలపాలన జనసేన అధినేత పవన్ కల్యాన్ తో పాటు పలు ప్రజా సంఘాలు, పలు పార్టీలు నిర్ణయించాయి, ఇందుకు విశాఖలోని అర్కే బీచ్ ను నిరసనస్థలంగా ఎంచుకున్నారు కూడా, అయితే సోషల్ మీడియాలో నిరసన తెలపాలని జరిగిన ప్రచారానికి తాము అనుమతి ఇవ్వలేమని, అసలు సోషల్ మీడియాలో ఈ అంశాన్ని ఎవరు పోస్టు చేశారో కూడా తెలియదని, అసాంఘిక కార్యకలాపాలు జరిగితే ఎవరు బాద్యత తీసుకుంటారని ప్రశ్నించి సైడ్ అయిపోయారు ఏపీ పోలీస్ బాస్. అయత అదేశాల మేరకు నిరసన తెలిపేందుకు వచ్చిన యువతను ఎక్కడిక్కడ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మొత్తానికి నిరసనను తుస్ మనిపించింది చంద్రబాబు సర్కారు.

అయితే రమారమి అందరూ మర్చిపోయిన తరుణంలో ఒక్క పవన్ కల్యాన్ మాత్రమే హోదా గురించి తన వాదనను తెరపైకి తీసుకువస్తున్న నేపథ్యంలో జల్లికట్టు తో మరోమారు హోదా అంశం తెరపైకి వచ్చింది. కాగా, జల్లికట్టు స్పూర్తితో ఈ సారి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖలు కూడా అంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై స్పందించారు. తమ్మారెడ్డి భరద్వాజ, సంపూర్ణష్ బాబులు ఏకంగా విశాఖలోని అర్కేబీచ్ కు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పలువురు హీరోలు ట్విట్టర్ వేదికగా మద్దతు ప్రకటించారు. ఇలా హోదాపై ప్రస్తుతం అవిరైన ఆశలకు మళ్లీ పునరుజ్జీవం పోశారు. ఇక రారున్న రెండేళ్లలో ఈ నిరసనలు ఎక్కడ, ఎలాంటి రూపం తీసుకుంటుందన్న విషయాన్న పక్కన బెడితే.. అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకున్న టీడీపీ ప్రభుత్వం మాత్రం చారిత్రక తప్పిదం చేసిందన్న విమర్శలు పెల్లుబిక్కుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles