సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్... జస్ట్ బాబు భజన | Only Chandrababu Prises motto at CII Summit.

Chandrababu nothing achieved with partnership summit

Confederation of Indian Industry, CII 2016, Partnership Summit Chandrababu, Chandrababu Praise, Central Ministers Praise Chandrababu Naidu, Sunrise Andhra Pradesh Motto,

Andhra Pradesh achieve during the two-day partnership summit held by Confederation of Indian Industry (CII) in coordination with the state government at Visakhpatnam. Chief Minister N Chandrababu Naidu might have claimed that the state would get investments worth Rs 10.50 lakh in the coming years with a job potential of 22 lakh and the state had signed 665 MoUs with various companies to that effect. But, The biggest achievement is for Naidu. He ensured that all the Central ministers and the invitees who attended the Partnership Summit lavished praises on him.

సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ఏం జరిగిందసలు?

Posted: 01/30/2017 06:50 PM IST
Chandrababu nothing achieved with partnership summit

పెట్టుబడులే లక్ష్యంగా పార్ట్ నర్ షిప్ సమ్మిట్, ప్రత్యేక ఏర్పాట్లు చేసి హడావుడి చేసిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిజానికి ఏం ఒరగబెట్టిందన్న చర్చ ఇప్పుడు మొదలైంది. విశాఖలో రెండు రోజుల పాటు జరిగిన సీఐఐ సదస్సులో జరిగిన వ్యవహారం, ఆపై చంద్రబాబు నోటి నుంచి వెలువడ్డ లెక్కలు అంతా గజిబిజి గందరగోళంగా ఉందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.

గతేడాది బిల్ గేట్స్ కలరింగ్ ఇప్పించి అంకెల గారడీ చేశాడంటూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం చూశాం. ఇక ఈ యేడాది సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అంటూ సుమారు 10.50 లక్షల కోట్ల పెట్టుబడులకు, 22 లక్షల ఉద్యోగాలకు సంబంధించి 665 ఒప్పందాలపై సంతకాలు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు గర్వంగా చెప్పుకుంటున్నప్పటికీ, వాటి వెనుక వాస్తవాలు ఎంతన్నది అనుమానంగానే ఉందని వారంటున్నారు.

అయితే ఆయన చెబుతున్న దానిలో పదో వంతు పెట్టుబడులు ఆచరణ రూపం దాల్చినా చాలన్నది వారి అభిప్రాయం. సదస్సుకు ఆర్థిక మంత్రితో సహా పలువురు అమాత్యులు, ప్రభుత్వానికి మద్ధతునిచ్చే పారిశ్రామిక మేధావులు పాల్గొన్నారు. ప్రతీ ఒక్కరూ చంద్రబాబు విజన్ గురించి, కఠోర శ్రమ, డైనమిక్ లీడర్ అంటూ పొగడ్తలు కురిపించారే తప్ప రాష్ట్రానికి చేయబోయే వాటి గురించి ఎక్కడా ప్రస్తావన తేలేదు.

ఓవైపు ప్రత్యేక హోదా గురించి మళ్లీ ప్రశ్నలు లేవనెత్తున్న సమయంలో ఆ టాపిక్ ఊసెత్తకుండా పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయంటూనే, కాకి లెక్కలు చెబుతున్నాడంటూ ఆర్థిక మేధావులు మండిపడుతున్నారు. కేంద్రం నుంచి ఎలాంటి మద్ధతు లేకపోయినా తెలుగు నేలపై పెట్టుబడులకు మాంచి పరిస్థితులు ఉన్నాయంటూ కలరింగ్ ఇచ్చే పని చేశాడు. అలాంటి స్థితిలో ఏ కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టేందుకు సాహసం చేయనే చేయదనేది వారి వాదన. ఓవరాల్ గా ఈ సమ్మిట్ ద్వారా జరిగబెట్టింది ఏంటయ్యా అంటే మాత్రం కేంద్ర మంత్రులతో సొంత డప్పు కొట్టించుకోవటమే... ప్రతిపక్షాలు సరిగ్గా ఈ పాయింట్ పట్టుకుంటే అధికార పక్షాన్ని అల్లాడించటం పెద్ద పనేం కాదు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP CM  Chandrababu Naidu  CII 2016  Partnership Summit  Vishkapatnam  Sunrise Andhra Pradesh  

Other Articles