పగటి కలల గురించి చౌదరమ్మ ఏమంటోది? | Renuka Chowdary Comments Telangana PCC Chief.

Renuka chowdary satires on uttam kumar reddy

Renuka Chowdary, Uttam Kumar Reddy , Telangana PCC Chief, Telangana Congress, 2019 Telangana Elections, Telangana Congress Chief Minister Candidate, Renuka Chowdary Uttam Kumar Reddy, Seniors Uttam Kumar Reddy, Uttam Kumar Reddy CM Race

Telangana PCC Chief Uttam Kumar Reddy received a jolt from senior Congress leader and Rajya Sabha member Renuka Chowdary. She asked him, albeit indirectly, to stop day-dreaming of becoming the chief minister.

పీసీసీ చీఫ్ పగటి కలలు కంటున్నాడా?

Posted: 01/28/2017 12:53 PM IST
Renuka chowdary satires on uttam kumar reddy

ఏదైనా మీటింగ్ లకు పిలుపునిస్తే కనీసం వందల సంఖ్యలో జనాలు కూడా గుమిగూడలేని స్థితికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. ఓవైపు సీఎం కేసీఆర్ హవా కొనసాగుతున్నా ప్రభుత్వ లోపాలను ప్రజల్లోకి తీసుకెళ్లే సత్తా లేని నేతల మూలంగా హస్తం పరిస్థితి అద్వానంగా తయారయ్యింది. దీనికి తోడు సీనియర్లకు జూనియర్లకు పొసగకపోవటం, బహిరంగంగా విమర్శలు చేసుకుంటూ పరువు బజారుకీడ్చటం అడపా దడపా జరుగుతూ వస్తున్నాయి.

రీసెంట్ గా మరోసారి ఇలాంటి వ్యవహారమే మరోకటి జరిగింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతల మధ్య ఉన్న వైరాన్ని తొలగించి, ఒకే తాటిపైకి తెచ్చేందుకు యత్నిస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఇందుకు సంబంధించి కార్యాచరణ గ్రౌండ్ లెవల్లో అల్రెడీ ప్రారంభించాడు కూడా. అదే సమయంలో వచ్చే ఎన్నికలకు పార్టీని తాను ముందుండి నడిపిస్తానంటూ ఓ ప్రకటన చేశాడు. అంతే ఉత్తమ్ స్టేట్ మెంట్ తో సీనియర్లకు ఒక్కసారిగా మండిపోయింది.

సీనియర్లు జానా రెడ్డి లాంటి వాళ్లు సీఎం పోస్ట్ కోసం కాచుకుని కూర్చుని ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ, తనను తాను హైలెట్ చేసుకునే క్రమంలో ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలపై వారికి మంటపుట్టించాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అయితే నేరుగానే ఉత్తమ్ కి వార్నింగ్ ఇచ్చేసింది. ముఖ్యమంత్రి కావాలన్న కలలను పక్కనబెట్టి ముందు పార్టీని పటిష్టం చేసేందుకు ప్రయత్నించండంటూ తెలిపింది. కొంత మంది పార్టీ కోసం కష్టపడకుండానే పగటి కలలు కంటున్నారు. ముందు క్షేత్ర స్థాయి నుంచి నాశనం అయిన పార్టీని పున:ప్రతిష్టించండి. ఆపై కేసీఆర్ పై చేయి సాధించేందుకు కావాల్సిన ప్యూహాలు రచించుకోండి. అంతే తప్ప గాంభీరాలకు పోకండి అంటూ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Congress  Uttam Kumar Reddy  Renuka Chowdary  

Other Articles