May Kanahaih kumar will together Left and congress

May kanahaih kumar will together left and congress

Modi, Kanaiah Kumar, CPI, CPM, COngress, JNU

May Kanahaih kumar will together Left and congress. JNU Student Leader Kaniah kumar trying to together Modi enemies.

లెఫ్ట్ ను కాంగ్రెస్ ను కలిపేందుకేనా..?

Posted: 03/25/2016 03:52 PM IST
May kanahaih kumar will together left and congress

వాస్తవానికి వామపక్ష భావాలున్న కన్నయ్యని కమ్యూనిస్టు పార్టీ నేతలు జాగ్రత్తగా మలిచే ప్రయత్నం చేస్తోంటే అందివచ్చిన అవకాశాన్ని అనుకూలంగా మలుచుకునే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ రోహిత్ మరణానికి తక్షణం స్పందించి దేశవ్యాప్తంగా మంచి మార్కులు సాధించిన రాహుల్ గాంధీ మంత్రాంగం ఇందులో ఉందనేది ఢిల్లీ వర్గాల మాట. స్వతహాగా మాటకారి అయిన కన్నయ్యని ఉపయోగించుకొని ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు యూనివర్శిటీల్లోని యువతరాన్ని ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగానే ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలు మొదలైనట్టు సమాచారం. కన్నయ్య సెంట్రల్ యూనివర్శిటీ వెళ్లడం వెనుక రాహుల్ సూచనలే పనిచేశాయి.

హైదరాబాద్ బయలుదేరేముందు యువరాజు రాహుల్ తో కన్నయ్య సమావేశం కావడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. మోడీ పాలనపై తగిన అస్త్రంగా విద్యార్థి ఉద్యమాల్ని మలుచుకునేందుకు కాంగ్రెస్, వామపక్ష శక్తులు బలమైన వ్యూహాన్నే సిద్దం చేసుకున్నాయి. హైదరాబాద్, విజయవాడల్లో జరిగిన ఆందోళనలు, నిరసనలు ఈ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఉపకరిస్తాయని సీనియర్ నేతలు అంచనా వేస్తున్నారు. రెండు చోట్లా గట్టి వ్యతిరేకత తెలిపామని కాషాయ వర్గాలు ఉత్సాహపడుతున్నా తెలీకుండానే కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకంలో పాత్రధారులయ్యారనేది నమ్మలేని నిజం!

మోదీపై పోరాటంలో అంబేద్క‌ర్‌వాదులు, వామ‌ప‌క్షాలు క‌లిసి ముంద‌డుగు వేయాలంటున్నాడు క‌న్న‌య్య‌….ఎరుపు మెరుపులు, నీలం విరుపుల‌తో మోదీ అరుపుల‌కు అడ్డుక‌ట్ట వేయ‌చ్చంటున్నాడు క‌న్న‌య్య‌. ప‌నిలో ప‌నిగా మ‌ధ్యేమార్గంలో ఉన్న పార్టీల‌ను కూడా క‌లుపుకునిపోవాలంటూ పిలుపునిచ్చాడు పిల్ల క‌న్న‌య్య‌…అంటే క‌న్న‌య్య చెప్పింది కాంగ్రెస్ గురించేన‌ని రాజ‌కీయ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి…బీజేపీని లెఫ్ట్‌రైట్ వాయిస్తున్న ఈ లెఫ్టిస్ట్ ఇప్పుడు కాంగ్రెస్‌తో క‌య్యం పెట్టుకోవ‌ద్దు వియ్యం పెట్టుకోండి అని క‌మ్యూనిస్టుల‌కు స‌ల‌హా ఇస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Kanaiah Kumar  CPI  CPM  COngress  JNU  

Other Articles