arun jaitley praises NCP party and sharad pawar, does see corruption

Bjp praises ncp to retain power in maharastra

sharad pawar, maharastra, shiv sena, NCP, arun jaitley, devendra fadnavis, sudendra kulkarni, gulam ali, uddav thakarey, sanjay raut, maharastra power politics, maha power change, maharastra new alliance, NCP corruption, irrigation projects

Exzctly a year ago, bjp alleged sharad pawar led ncp as corrupted party in assembly elections, but now praises the same to retain power

ఏ ఎండకాగొడుగు పట్టడంలో బీజేపికి సాటెవరు..?

Posted: 10/24/2015 04:50 PM IST
Bjp praises ncp to retain power in maharastra

ఏ ఎండకా గోడుగు పట్టడంలో రాజకీయ పార్టీల రూటే సపరేటు. అయితే గత మూడున్నర దశాబ్దాలుగా లేని మోజారిటీతో అధికారంలోకి వచ్చిన  ఎన్డీఏ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం ఇందుకు బిన్నమనుకున్నారు అందరు.
దానికి కారణం.. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీ అప్పటికే దేశాన్ని ఎలిన పార్టీలపై, వాటి విపరీతాలపై విమర్శలను గుప్పించడమే. అయితే అధికార పీఠం ఎక్కీ ఎక్కగానే దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికలలో మోడీ మానియాకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో దేశవ్యాప్తంగా బిజేపీ హవా కోనసాగాలన్న యావతో ఆ పార్టీ నేతలు కూడా ఏఎండకా గొడుగు పట్టడంలో నిష్టాతులుగా మారుతున్నారు.

అందుకే కాబోలు.. సార్వత్రిక ఎన్నికలు సహా.. మహారాష్ట్ర ఎన్నికలలో శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీపై విమర్శలను గుప్పించిన బీబేపి.. ఇప్పుడు ఆ పార్టీపై ప్రశంసలు గుప్పిస్తుంది. సుదీంద్ర కులకర్ణి ముఖానికి నల్లరంగు పూయడం, గులాం అలీ కచేరీని అడ్డుకోవడం వంటి చర్యలతో మహారాష్ట్రలో పంటికింద రాయిలా ఉన్న శివసేనతో సంబంధాలు తెంచుకునే దిశగా బిజెపి చురుగ్గా అడుగులు వేస్తున్న తరుణంలోనే అటు ఎన్సీపీని అక్కున చేకుర్చకునేందుకు కూడా చర్యలు చేపడుతోంది.

నిన్న మొన్నంటి వరకు అవినీతి పార్టీలకు తమ పార్టీ దూరంగా వుంటామని చెప్పిన బిజేపి.. విదేశాలలో భారత్ లో అవినీతి తగ్గించదన్న ప్రధాని ప్రసంగాలు కేవలం డాబే తప్ప అందులో నిజం లేదని ఈ నూతన కలయికలు రూడా చేస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికలలో రాజీవ్ ప్రతాప్ రూడా ఎట్టి పరిస్థితుల్లో తామ పార్టీ ఎన్సీపీ అవినీతిపై విచారణ జరిపిస్తామమని హామీలు గుప్పించగా, ఇప్పుడదే పార్టీని అక్కున చేర్చుకుంటున్నారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. ఒకరు విచారణ జరిపిస్తామంటే మరోకరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

బారామతి ప్రాంత అభివృద్ధికి శరద్ పవార్ చేసిన కృషి మరవలేనిదని ప్రశంసల జల్లు జైట్లీ కురిపించారు. 50 ఏళ్లుగా పవార్ చేస్తున్న కృషి అంతా ఇంతా కాదన్నారు. కొంత కాలం క్రితం ప్రధాని మోదీ కూడా పవార్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. నెలలో రెండు సార్లైనా తాను పవార్‌తో మాట్లాడి ఆయన అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకుంటానని చెప్పారు. 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బిజెపికి 123 మంది ఎమ్మెల్యేలున్నారు. అధికారంలో కొనసాగాలంటే 145 మంది ఎమ్మెల్యేలు తప్పని సరి. 63 మంది ఎమ్మెల్యేలున్న శివసేన తప్పుకుంటే 41 మంది ఎమ్మెల్యేలున్న ఎన్సీపీ మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే ఎన్సీపీకి మరింత దగ్గరయ్యేందుకు బిజెపి తీవ్రంగా యత్నిస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sharad pawar  maharastra  shiv sena  NCP  arun jaitley  

Other Articles