Gundu Sudharani ready to join into TRS Party

Gundu sudharani ready to join into trs party

Gundi SUdharani, TRS, Telanagana, TRS Aakarsh, Vivek, KCR

Gundu SUdharani getting ready to join into the TRS soon. TRS party leaders alredy did all arrangements for joining Gundu Sudhararani.

గుండు సుధారాణి కారులో షికారు..!

Posted: 10/27/2015 04:45 PM IST
Gundu sudharani ready to join into trs party

తెలంగాణలో గులాబీ ఆకర్ష్ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి కూడా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం కన్ ఫర్మ్ అయింది. ఈ నెల 29న గులాబీ కండువా కప్పుకోవడానికి గుండు సుధారాణి ముహూర్తం ఫిక్స్ కూడా చేసుకున్నారట. నిన్న టీ.ఆర్.ఎస్ ఎంపీ వినోద్ కుమార్ తో భేటీ అయిన ఆమె..కేసీఆర్ పార్టీలో చేరికపై చర్చించారు.

వరంగల్ లోకసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల సందర్భంగా విపక్షాలకు చెందిన పలువురు నేతలు కారు ఎక్కేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. వరంగల్ ఉప ఎన్నిక కోసం కాకపోయినా, త్వరలోనే వరంగల్ నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ ఎస్ లో చేరేందుకు గుండు సుధారాణి ఆసక్తి చూపుతున్నారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఆమె వినోద్ కుమార్ తో భేటీ అయ్యారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాగానే సుధారాణి టీఆర్ ఎస్ లో చేరనున్నారు. కాగా మరో పార్టీ నేత కూడా కారెక్కెందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారట. వైసీపీలో ముఖ్య నేతగా కొనసాగిన మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి కూడా గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gundi SUdharani  TRS  Telanagana  TRS Aakarsh  Vivek  KCR  

Other Articles