Mla balakrishna visit in hindupuram

mla balakrishna visit in hindupuram, mla balakrishna, tdp, cm chandrababu, tdp leaders, Legend 100 days Function, Legend 100 days Function at Hindupur , telugu movie news legend, balakrishna,

mla balakrishna visit in hindupuram, Legend 100 days Function at Hindupur

బాలయ్య వస్తున్నాడు..? రండి.. !

Posted: 07/03/2014 10:32 AM IST
Mla balakrishna visit in hindupuram

నటుడు, ఎమ్మెల్యే బాలయ్య ఒంట్లో రాజకీయ రక్తం జెట్ స్పీడ్ తో పరుగులు తీస్తుంది. దీంతో బాలయ్య సినిమాల మీద కంటే.. తనను మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిపించిన అనంతపురం జిల్లా హిందుపూరం ప్రజల మీద అభిమానం చూపిస్తున్నాడు. బాలయ్యలో రాజకీయ మనిషి కంటే.., ప్రజలకు సేవ చేయాలనే తపన ఆయనలో కనిపిస్తుందని ఆ నియోజకవర్గం ప్రజలు అంటున్నారు.

ఇప్పుడు హిందూపురంలో.. ‘‘ బాలయ్య వస్తున్నాడు’’ అనే విషయం అందరికి అర్థమయింది. బాలయ్య రాక కోసం ఆ నియోజకవర్గం ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రజలు అలా ఎదురుచూడటం వెనుక.. బాలయ్యే బలమైన కారణమని అనంతపురం జిల్లా టిడిని నేతలు అంటున్నారు. బాలయ్య జరుపుకొని ప్రతి సొంత విషయాన్ని హిందూపురం నియోజక వర్గం ప్రజలతో జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి. అందుకే.. ఆయన మనసు నటనపై కంటే.. హిందుపూరం అభివృద్ది పైనే పెట్టినట్లు తెలుస్తోంది. 

అంతేకాకుండా ఈరోజు హిందూపురంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎంపిక జరగుతున్న సందర్భంగా బాలయ్య హిందుపురం బయలుదేరారు. దీంతో అక్కడ రాజకీయ నేతలు, కార్యకర్తలు, బాలయ్య వస్తున్నాడు అంటూ.. ఆనందంగా..పసుపు చొక్కాలు వేసుకొని, ఎమ్మెల్యే బాలయ్య కు స్వాగతం చెప్పటానికి సిద్దంగా ఉన్నారు.

అంతేకాకుండా ఆయన నటించిన లెజెండ్ సినిమా ఇవాళ్టికి 98 రోజులు పూర్తి చేసుకోనున్న సందర్భంలో..అభిమానుల కోరిక మేరకు హిందూపురంలో నిర్వహించనున్న లెజెండ్ 100 రోజుల ఫంక్షన్ లో తాను పాల్గొననున్నట్లు బాలయ్య చెప్పటం జరిగింది.

ఏమైన బాలయ్య రాజకీయ పోకడు చూస్తుంటే.. నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి కంటే రాజకీయల్లో బాలయ్యే బెటర్ అని నిరూపించుకుంటాడని రాజకీయ మేథావులు అంటున్నారు. అంటే బాలయ్య ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చటానికి, సిఎం చంద్రబాబుతో ఫైట్ చేస్తున్నట్లు ఎన్టీఆర్ భవన్ లో నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

అయితే బావమరిది మాటకు.. బావ చంద్రబాబు కొంచెం సమయం పెట్టినట్లు పార్టీలోని సినియర్ నాయకులు అంటున్నారు. హామీల విషయం లో.. బావ, బావమరిది మద్య ఎలాంటి విబేధాలు రావు కదా? ఏం చెప్పలేం? ఇంకా చాలా రోజులు ఉన్నాయి కాబట్టి చూద్దాం. !!!!!

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles