All parties planning to celebrate telangana on june 2 date

Telangana Formation Day, Telangana on June 2 date, Telangana State Formation, All parties planning to celebrate june 2 date, all parties in telangana, kcr, trs party, telagana bjp, bjp leaders celebrate june 2, all parties celebration in june 2.

All parties planning to celebrate Telangana on June 2 date, Telangana State Formation, Telangana Formation Day,

సంబరాలకు రెడీ అవుతున్న టీ-పార్టీలు!

Posted: 05/29/2014 09:39 AM IST
All parties planning to celebrate telangana on june 2 date

జూన్ 2తేదీ రాక అతి దగ్గరలో పడటంతో సంబరాలకు రెడీ అవుతున్నాయి..తెలంగాణలోని రాజకీయ పార్టీలు. ఆ రోజు తెలంగాణ ప్రజలకు, నేతలకు పెద్ద పండగే. తెలంగాణ తెచ్చినోళ్లు , తెలంగాణ ఇచ్చినోళ్లు, తెలంగాణ పోరాటం చేసినోళ్లు, తెలంగాణకు మద్దతు ఇచ్చినోళ్లు.. ఒకరుకొకరు పోటీ పడి సంబరాలు జరుపుకునేందుకు సిద్దమవుతున్నారు. అయితే కొన్ని పార్టీలు మాత్రం .. గులాబి దళానికి దీటుగా సంబరాలు జరుపుకోవాలని .. కేంద్రం నుండి ఫర్మిషన్ ఫండ్ తీసుకున్నట్లు సమాచారం.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సమీపిస్తుండడంతో టీఆర్ఎస్‌కు ధీటుగా తెలంగాణ సంబురాలు నిర్వహించేందుకు సీపీఐ, బీజేపీలు, కాంగ్రెస్ పార్టీలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ టీఆర్ఎస్ పేటెంట్‌ కాదని నిరూపించేందుకు ఆవిర్భావ దినోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. గ్రామగ్రామాన జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాలు ఎగుర వేసేందుకు రెడీ అవుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో తమ పాత్రను గుర్తు చేసే విధంగా ఆట పాటలతో హోరెత్తించనున్నాయి.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయిన .. జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని.. తెలంగాణ సంబరాలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కోసం.. బిజెపి, సిపిఐలు.. అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీలో గొంతు చించుకున్నా.. ప్రజలు వాటివైపు చూడలేదు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో.. తెలంగాణలో బిజెపి, సిపిఐలు అనుకున్న ఫలితాలను సాధించలేక డీలాపడ్డాయి.

telangana-celebration-june-2

తెలంగాణ అసెంబ్లీలో సిపిఐ ఒకేఒక్క స్థానాన్ని గెలుచుకుంది. ఇక బిజెపి ఒక ఎంపీ, ఐదు అసెంబ్లీ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను సైతం కాదని.. ప్రజలు టిఆర్ఎస్‌కే పట్టం కట్టారు. దీంతో తన పట్టును కొనసాగించేందుకు, ప్రజల్లో విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు టిఆర్ఎస్.. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న భారీ సంబురాలు నిర్వహించడానికి పూనుకుంది. అనుకున్నట్లుగానే ఏర్పాట్లు చేసుకుంటోంది.

మరో పక్క పసుపు తమ్ముళ్లు కూడా .. తెలంగాణ సంబరాలు జరుపుకోవటానికి .. ఆ పార్టీ అధినేత నుంచి ఫర్మిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జూన్ 1 అర్థరాత్రి నుంచే తెలంగాణ సంబురాలు నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు బిజీగా ఉన్నాయి.తెలంగాణ మొత్తం గులాబీ కలర్ తో నిండిపోవాలని ఆ పార్టీ నేతలు కార్యకర్తలకు సూచించారు. అదే విధంగా.. పువ్వు గుర్తోళ్ళు , సైకిల్ గుర్తోళ్లు, సుత్తి కొడవలి గుర్తోళ్లు, కొడవలి కంకీ గుర్తోళ్లు తమ తమ పార్టీ రంగులతో తెలంగాణ మొత్తం నింపాలనే ఉద్దేశంలో ఉన్నట్లు సమాచారం.

ఇక గులాబీ బాస్ గురించి మీకు తెలిసిందే. ఆయన సెంటిమెంట్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే వార్ రూమ్ .. జూన్ 2 న చేయాల్సిన కార్యక్రమాలను సిద్దం చేసి ఉంచినట్లు తెలుస్తోంది. ఇక టీ-పార్టీల సంబురాలు చూడటంమే మన వంతు..?

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles