Balakrishna interested to contest

Balakrishna interested to contest, 2014 elections, Nandamuri Bala Krishna, Legend movie, Simhachalam Appanna, Telugu desam party, Chandrababu Naidu, NT Rama Rao

Balakrishna interested to contest in elections

బావనడిగి చెప్తానంటున్న బాలయ్య

Posted: 04/01/2014 08:56 AM IST
Balakrishna interested to contest

ఈ సారి ఎన్నికలలో పోటీ చెయ్యాలనే ఉంది.  కానీ అంతా చంద్రబాబు ఇష్టం, ఆయనతో మాట్లాడిన తర్వాత చెప్తాను అంటున్నారు బాలయ్య. 

సినిమా విడుదలకు ముందు, విడుదల తర్వాత తన ఇష్టదైవమైన నారసింహుని దర్శించుకుని ఆశీస్సులందుకునే అలవాటున్న బాలయ్య లెజెండ్ సినిమా విడుదల అనంతరం సింహాద్రి అప్పన్న ఆలయానికి స్వామి దర్శనార్ధం వెళ్ళారు.  ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడిన బాలకృష్ణ తెదేపాలో తాను అంతకుముందు చెప్పినట్లుగా క్రియాశీల రాజకీయాలలోకి రావలని ఉందనే తెలియజేసారు.

తెలుగు దేశం పార్టీని స్థాపించిన తన తండ్రిగాని ఆశయసిద్ధి కోసం ఆ పార్టీలో పనిచెయ్యవలసిన అవసరం తనకి ఉందని చెప్పిన బాలకృష్ణ ఎక్కడి నుండి పోటీ చేస్తారన్న దాని గురించి మాత్రం పార్టీ అధ్యక్షుడు, బావ, వియ్యంకుడు అయిన చంద్రబాబు నాయుడు తో చర్చలు జరిపిన తర్వాతనే చెప్పగలనని అన్నారు.

రాజకీయాలలో పనిచెయ్యటం అవసరమే అయినా దానితో సమానంగా అభిమానులకు వినోదాన్ని పంచటం కూడా తన కర్తవ్యమేనంటూ బాలకృష్ణ ముక్తాయింపునిచ్చారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles