Asaduddin owaisi warns pawan kalyan

Asaduddin Owaisi, Pawan Kalyan, pawan kalyan vs owaisi, Hyderabad MP Asaduddin Owaisi, Asaduddin Owaisi warns Pawan Kalyan, janasena party meeting in vizag.

Asaduddin Owaisi warns Pawan Kalyan

ఒవైసి ‘పవన్’కు వార్నింగ్ - రేపు రంగుపడుద్ది?

Posted: 03/26/2014 12:09 PM IST
Asaduddin owaisi warns pawan kalyan

ఇప్పటి వరకు  తెలంగాణ ప్రాంత నాయకులు  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై  కామెంట్స్,  హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా  హైదరాబాద్ ఎంసీ అసదుద్దీస్ ఒవైసీ కూడా ఒక హెచ్చరికీ జారీ చేసినట్లు తెలుస్తోంది.

పవన్  కళ్యాణ్   గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని కలిసిన సందర్బం పై పవన్ పై  ఒవైసీ మండిపడుతున్నారు. మోడీ కి మద్దతు ఇవ్వమని చెప్పడానికి నువ్వు ఎవరని ఒక మతతత్వ వాదికి మద్దతు ఇవ్వమని ఎలా చెబుతావని నిలదీసారు. 

బిజెపి కి మద్దతు ఇస్తూ ముందుకు సాగితే నీ సినిమాలు హైదరాబాద్ లో రిలీజ్ కాకుండా అడ్డుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు. నరేంద్ర మోడీ కి మీడియా అనవసరమైన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని ఇది మంచిది కాదని తీవ్ర అసహనం తో అన్నారు. అంతా బాగానే ఉంది కానీ మోడీ మతతత్వ వాది అయితే మరి ఒవైసీ ఏంటోనని   పవన్ యెక్క ముస్లీం అభిమానులు అడుగుతున్నారు. 

పవన్ కళ్యాణ్ ఏ రాజకీయ నాయకుడ్ని కలిస్తే.. ఓవైసీకి ఏమవుతుంది.  అది పవన్  వ్యక్తిగత విషయం.   పవన్ అవసరమైతే.. మోడీ, ఓబామాను,  పాకిస్థాన్  దేశ అద్యక్షుడుతోనైన కలిసి మాట్లాడతాడు.   అది పవన్ కళ్యాణ్  వ్యక్తిగత విషయం.  

అయినా ఎప్పుడు లేనిది ఇప్పుడు కొత్తగా  పవన్ కళ్యాణ్  పై  ఒవైసీ హెచ్చరికలు  జారీ  చేయటం చాలా ఆశ్చర్యంగా ఉందని  పవన్ యొక్క ముస్లీం అభిమానులు అంటున్నారు.  ఒవైసీ  ఇలా మాట్లాడటం వెనుక   టీఆర్ఎస్ పార్టీ నాయకులు హస్తం ఉందని  పవన్ అభిమానులు అంటున్నారు.  

ఇప్పటి వరకు  ఓవైసీ గురించి గానీ,  ముస్లీం సోదరుల గురించి గానీ  పవన్ కళ్యాణ్  ఎప్పుడు, ఎక్కడ గానీ అలుసుగా  మాట్లాడినట్లు  చరిత్రలో లేదు.  అలాంటి ఓవైసీ కావాలనే  ఉద్దేశంతో  పవన్ పై  విమర్శలు చేస్తున్నారని   పవన్ అభిమానులు  అంటున్నారు.  

రేపు జరగబోయే  జనసేన పార్టీ  భారీ సభలో లో.. ఒవైసి  హెచ్చరికలపై .. రంగుపడుద్దని  పవన్ అభిమానులు అంటున్నారు.  ఎందుకంటే.. గతంలోనే పవన్ కళ్యాణ్  చెప్పటం జరిగింది.  నేను ఎవరి జోలికి వెళ్లను.. నా జోలికి వస్తే..  తాట తీస్తానురోయ్.. అన్న మాటలను  పవన్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.  రేపు సభలో  పవన్ కళ్యాణ్  ఓవైసీ ఎలాంటి సమాధానం చెబుతారో చూద్దాం. 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles