Ravindranath tagore quotation

ravindranath tagore quotes, tagore word of wisdom, bhagawadgita, sri krishna, nature, god, allah, deity

ravindranath tagore quotation

రవీంద్రనాథ్ టాగోర్ సూక్తి

Posted: 04/24/2013 02:22 PM IST
Ravindranath tagore quotation

మనకు చెందిన ప్రతివస్తువూ మనకి చేరుతుంది.  
దాన్ని అందుకునే అర్హతను సంపాదించుకోవాలంతే - రవీంద్రనాథ్ టాగోర్

మనకు అర్హత ఉన్న ప్రతి వస్తువూ మనకు దొరుకుతుంది కాబట్టి వాటి కోసం ఆరాటపడటం అనవసరం.  వాటిని పొందే యోగ్యతలను సంపాదించుకుంటే చాలు.  

ఇలా భక్తి తత్వంలో కూడా అందరూ చెప్తారు.  అన్నీ దేవుడే చూసుకుంటాడు.  మీ కేది కావాలో వాడికి తెలుసు.  మీరు అడగవలసిన పనిలేదు అని కూడా అంటారు. 

ఈ విశ్వ వ్యవస్థలో ఎవరికేం కావాలన్నది చూసి అందించే ప్రణాళిక ఉందన్నది పరమ సత్యం.  ఒక చిన్న సంస్థలో చూసుకున్నా, ఉద్యోగులలో ఎవరికి ఏం ఇవ్వాలన్నది యాజమాన్యానికి తెలుస్తుంది.  ఒక వాచ్ మన్ వచ్చి నాకు కంప్యూటర్ ఇవ్వండి అని అడిగితే, అతను తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించటానికి అది అవసరం లేకపోతే ఇవ్వటం జరగదు.  అలాగే అడక్కపోయినా, సామర్ధ్యాన్ని పెంచటం కోసం ఉద్యోగులకు అవసరమైన వస్తువులను అందుబాటులోకి తెస్తారు.

ఆ వస్తువులు కావాలీ అని యాజమాన్యాన్ని అడిగి, ఇవ్వనందుకు కినుకవహించాల్సిన అవసరం లేదు.  అసలు అడగాల్సిన అవసరమే లేదు. మీకు యాజమాన్యం ఏదైనా సౌకర్యం కలిగించిందీ అంటే దాని ద్వారా మీ సామర్ధ్యాన్ని పెంచి మీ నుండి ఇంకా ఎక్కువ ఉత్పాదన, లేక సేవలను గ్రహించటానికే కాబట్టి, వాటిని గ్రహించే అర్హతను సంపాదించి ఆ మెట్టు ఎక్కితే అక్కడ లభించేవన్నీ వాటంతటవే లభిస్తాయి.  చిన్న సంస్థలోనే అలాంటి సదుపాయం ఉన్నప్పుడు, చరాచర జీవరాశులనూ నడిపించే వ్యవస్థకు- దేవుడే అనండి, భగవంతుడనండి, ప్రకృతి అనండి, అల్లా అనండి, గాడ్ అనండి, రబ్ అనండి, ఝూలేలాలా అనండి- మీకు కావలసిన వస్తువులను మీకు సమకూర్చటం పెద్ద లెక్కా? 

అందువలన ఎదగండి, యోగ్యతను సంపాదించుకోండి కానీ ఏమీ ఆశించవలసిన అవసరమే లేదు.  వాటి మీద దృష్టే అవసరం లేదు.  అందుకే భగవద్గీతలో కూడా, మీ ధర్మాన్ని నిర్వర్తించండి కానీ ఫలితాన్ని ఆశించకండి అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Swamy vevakananda

    స్వామి వివేకానంద

    Oct 29 | బాధ పెట్టినా, పెట్టకపోయినా నిజాన్ని ధైర్యంతో గంట కొట్టినట్లు చెప్పండి. బలహీనతను గురించి ఎప్పుడూ ఆలోచించకండి. బుద్ధిమంతులు నిజాన్ని భరించలేక పోతే లేదా దానిలోవడి కొట్టుకుపోతారనుకుంటే కూడా దిగులు పడకండి. అలాంటి వ్యక్తులు ఎంత... Read more

  • Gandhi word of wisdom

    May 03 | ప్రార్ధన అంటే ఉదయం లేచినప్పుడు తాళం చెవి, రాత్రి పడుకునేముందు తలుపు గడియ- మహాత్మా గాంధీప్రార్ధన చేస్తూ ఉదయాన్ని ప్రారంభించండి, పడుకునే ముందు ప్రార్ధన చెయ్యండి అని చెప్పటాన్ని ఆ విధంగా సుందరమైన ఉపమానంతో... Read more

  • Rabindranath tagore quotes

    May 02 | శిశువు జన్మించినప్పుడల్లా దేవుడింకా మానవజాతిమీద నమ్మకాన్ని పోగొట్టుకోలేదనే సంకేతం వస్తుంది - రవీంద్రనాథ్ టాగూర్   ఎంత చక్కని ఆలోచన  ప్రకృతిలో మానవజాతి అంతరించకుండా చూస్తున్నాడంటే దేవుడికింకా మానవుల మీద నమ్మకం పోలేదన్నమాట.  తన... Read more

  • Adi shankaracharya quotes

    May 01 | ముక్తిమార్గంలో అత్యుత్తమమైనది భక్తి మార్గం.  అందులో లక్ష్యం ఎవరిని వారు తెలుసుకోవటం - ఆది శంకరాచార్య.భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మయోగం, హఠయోగం, సన్యాసం, మంత్ర యోగం ఇలా ఎన్నో మార్గాలను మనకు పెద్దలు... Read more

  • Swamy vivekananda quotes

    Apr 30 | భూమి ఒక్క గొప్ప వ్యాయామశాలఇక్కడికొచ్చి మనం శక్తివంతులుగా తయారవుతాం - స్వామి వివేకానందమానవ జీవితాన్ని ఎందరో ఎన్నో రకాలుగా వర్ణించారు.  కొందరు దీన్ని రంగస్థలం, దీని మీద మనం ఆడేది నాటకం అని అన్నారు. ... Read more