Bhagwan rajneesh

osho, rajneesh, bhagwan rajneesh, motherhood

bhagwan rajneesh, osho

భగవాన్ రజనీష్

Posted: 03/09/2013 05:59 PM IST
Bhagwan rajneesh

rajneesh

పిల్ల పుట్టగానే తల్లీ పుడుతుంది – భగవాన్ రజనీష్

పిల్లపుట్టగానే తల్లీ పుడుతుంది.  అంతకు ముందు తల్లి కాదు ఒక స్త్రీ మాత్రమే.  మాతృత్వం కొత్తగా పుట్టిందే.  పిల్లను కనటంతోనే తల్లిగా మరో జన్మనెత్తుతుంది.  అంటారు భగవాన్ రజనీష్.  

ఇది ఒక్క తల్లీ పిల్లలు కలిసి అవతరించేదే కాదు.  ఇంకా చాలా సంబంధాలలో అలాగే జరుగుతుంది.  భార్య లేక భర్త లేడు, భర్త లేక భార్య లేదు, శిష్యులు లేక గురువు లేడు, దానం తీసుకునేవాడు లేకపోతే దాత లేడు.

మనకు తల్లి తండ్రి, గురు స్థానమిచ్చినవారి పట్ల మనం కృతఙతతో మెలుగుతూ వారిపట్ల మన బాధ్యతలను నెరవేర్చాలి.  పెద్ద ఎత్తున అలంకరణలు ఆర్భాటాలు చేసి వేడుక చేసుకోవాలనుకున్నప్పుడు పిలిచిన అతిథులు రాకపోతే ఎలావుంటుంది.  వెలవెలబోతుంది కదా.  అందుకే అతిథులు చాలా ముఖ్యులు.  దానమివ్వాలన్నది ఒక ఆచారంగా అలవాటుగా దినచర్యగా పెట్టుకుని ఆ పని చేసిన తర్వాతనే తను తినే నియమం పెట్టుకున్నప్పుడు ఎవరూ ఇంటికి ముందుకు అడగటానికి రాకపోతే ఎంతగా ఎదురు చూడటం జరుగుతుంది.  ఆ సమయంలో ఎవరైనా వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది.

అందుకే తల్లికి బిడ్డ మీద అంత ప్రేమ.  తనకి మాతృత్వాన్ని అందించినందుకు కృతఙతా పూర్వకమైన ప్రేమను భాషలో పెట్టలేక ముద్దులతో ముంచేస్తుంది తల్లి.  అదేవిధంగా అన్ని బందాలలోనూ కృతఙతను కలిగి ప్రవర్తించటం ప్రేమను సాధించటానికి మొదటి మెట్టు.  

ప్రతిరోజూ ఉదయం లేవగానే అందరికీ మనసులోనే కృతఙతలు చెప్పుకునే అలవాటు చాలా మంచిది.  మనం తింటున్న ఆహారాన్ని ఎవరు పండించారో, మనం ఉంటున్న ఇంటిలో ఎందరి శ్రమ ఉందో, మనం వాడుతున్న వస్తువులను కనిపెట్టినవాళ్ళు, తయారు చేసినవారు, స్టాకు పెట్టినవారు, రిటైల్ లో అమ్మినవారు, ఇంటికి తరలించినవారు ఇలా జీవితంలో అఙాతంగా మనకోసం పనిచేసినవారెందరో ఉన్నారు. వారందరి పట్లా కృతఙతను తెలుపుకుంటూ, ప్రతిగా నావంతు సేవ నేనూ చేస్తాను అని దినచర్యలోకి పోవటంలో ఆనందం ఉంటుంది, తృప్తీ కలుగుతుంది, నిరాశా నిస్పృహలకు దూరంగా ఉంటాము, శక్తి వంచన లేకుండా సమాజంలో మన వాటా శ్రమను అందజేస్తాము.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Swamy vevakananda

    స్వామి వివేకానంద

    Oct 29 | బాధ పెట్టినా, పెట్టకపోయినా నిజాన్ని ధైర్యంతో గంట కొట్టినట్లు చెప్పండి. బలహీనతను గురించి ఎప్పుడూ ఆలోచించకండి. బుద్ధిమంతులు నిజాన్ని భరించలేక పోతే లేదా దానిలోవడి కొట్టుకుపోతారనుకుంటే కూడా దిగులు పడకండి. అలాంటి వ్యక్తులు ఎంత... Read more

  • Gandhi word of wisdom

    May 03 | ప్రార్ధన అంటే ఉదయం లేచినప్పుడు తాళం చెవి, రాత్రి పడుకునేముందు తలుపు గడియ- మహాత్మా గాంధీప్రార్ధన చేస్తూ ఉదయాన్ని ప్రారంభించండి, పడుకునే ముందు ప్రార్ధన చెయ్యండి అని చెప్పటాన్ని ఆ విధంగా సుందరమైన ఉపమానంతో... Read more

  • Rabindranath tagore quotes

    May 02 | శిశువు జన్మించినప్పుడల్లా దేవుడింకా మానవజాతిమీద నమ్మకాన్ని పోగొట్టుకోలేదనే సంకేతం వస్తుంది - రవీంద్రనాథ్ టాగూర్   ఎంత చక్కని ఆలోచన  ప్రకృతిలో మానవజాతి అంతరించకుండా చూస్తున్నాడంటే దేవుడికింకా మానవుల మీద నమ్మకం పోలేదన్నమాట.  తన... Read more

  • Adi shankaracharya quotes

    May 01 | ముక్తిమార్గంలో అత్యుత్తమమైనది భక్తి మార్గం.  అందులో లక్ష్యం ఎవరిని వారు తెలుసుకోవటం - ఆది శంకరాచార్య.భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మయోగం, హఠయోగం, సన్యాసం, మంత్ర యోగం ఇలా ఎన్నో మార్గాలను మనకు పెద్దలు... Read more

  • Swamy vivekananda quotes

    Apr 30 | భూమి ఒక్క గొప్ప వ్యాయామశాలఇక్కడికొచ్చి మనం శక్తివంతులుగా తయారవుతాం - స్వామి వివేకానందమానవ జీవితాన్ని ఎందరో ఎన్నో రకాలుగా వర్ణించారు.  కొందరు దీన్ని రంగస్థలం, దీని మీద మనం ఆడేది నాటకం అని అన్నారు. ... Read more