Satyasai

satya sai, puttaparti, saibaba, shirdi

bhagwan satya sai, puttaparti sabibaba, shirdi saibaba

మంచిమాట

Posted: 03/06/2013 05:28 PM IST
Satyasai

satya-sai

ప్రసాదం అందాలంటే మీ చేతులు ఖాళీగా ఉండాలి – భగగవాన్ సత్యసాయి

చేతులు నిండుగా ఉండి ప్రసాదం కోసం చేయి చాచటం సరికాదు.  అంటే దాని అర్థం, అర్థించే ముందు మీకు నిజంగా అవసరం ఉందా లేదా అని చూసుకోండి అన్నది ఒక దృష్టికోణం.  మీకు అవసరం లేనిది అడిగి తీసుకోవటం జరిగితే నిజంగా అవసరం ఉన్నవారి హక్కుని మీరు లాక్కున్నట్టే.  

కొందరు అన్ని ఆధ్యాత్మిక కేంద్రాలకూ వెళ్తుంటారు.  కానీ దేన్నీ పూర్తిగా స్వీకరించరు.  దేనికీ శరణాగతి అవరు.  దేన్నీ పాటించరు. ఎప్పటికప్పుడు తాజాగా ఒక ఆధ్యాత్మిక గురువునో, ఆధ్యాత్మిక సంస్థనో ఎన్నుకుంటుంటారు.  అటువంటి వారికి కూడా చెయ్యి ఖాళీగా లేనట్టే.  వారికి ఎక్కడికిపోయినా ఏ గురువుని ఆశించినా ఏమీ దక్కదు.  ఎందుకంటే వారి చెయ్యి (బుర్ర) ఖాళీగా లేదు.  ముందుగానే కొన్ని అభిప్రాయాలతో నిండిపోయివుంది.  కానీ దేన్నీ నమ్మటం సాధ్యం కావటంలేదు.  

ఒక భగవంతుడిని నమ్ముకున్నవాళ్ళకి కూడా కొన్నాళ్ళ తర్వాత ఆ పాత ఫొటోని తీసి కొత్త ఫొటో పెట్టాలనో లేకపోతే కొత్తగా వచ్చిన భజన పాటలను వినాలనో అనిపించటం కూడా అటువంటిదే.  ఫొటో చూడటం కానీ, స్తుతించటం కానీ మనకోసమే, మనలో భక్తి భావన పైకి ఉబకటం కోసమే కానీ ఎవరినో పొగడటానికి కాదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Swamy vevakananda

    స్వామి వివేకానంద

    Oct 29 | బాధ పెట్టినా, పెట్టకపోయినా నిజాన్ని ధైర్యంతో గంట కొట్టినట్లు చెప్పండి. బలహీనతను గురించి ఎప్పుడూ ఆలోచించకండి. బుద్ధిమంతులు నిజాన్ని భరించలేక పోతే లేదా దానిలోవడి కొట్టుకుపోతారనుకుంటే కూడా దిగులు పడకండి. అలాంటి వ్యక్తులు ఎంత... Read more

  • Gandhi word of wisdom

    May 03 | ప్రార్ధన అంటే ఉదయం లేచినప్పుడు తాళం చెవి, రాత్రి పడుకునేముందు తలుపు గడియ- మహాత్మా గాంధీప్రార్ధన చేస్తూ ఉదయాన్ని ప్రారంభించండి, పడుకునే ముందు ప్రార్ధన చెయ్యండి అని చెప్పటాన్ని ఆ విధంగా సుందరమైన ఉపమానంతో... Read more

  • Rabindranath tagore quotes

    May 02 | శిశువు జన్మించినప్పుడల్లా దేవుడింకా మానవజాతిమీద నమ్మకాన్ని పోగొట్టుకోలేదనే సంకేతం వస్తుంది - రవీంద్రనాథ్ టాగూర్   ఎంత చక్కని ఆలోచన  ప్రకృతిలో మానవజాతి అంతరించకుండా చూస్తున్నాడంటే దేవుడికింకా మానవుల మీద నమ్మకం పోలేదన్నమాట.  తన... Read more

  • Adi shankaracharya quotes

    May 01 | ముక్తిమార్గంలో అత్యుత్తమమైనది భక్తి మార్గం.  అందులో లక్ష్యం ఎవరిని వారు తెలుసుకోవటం - ఆది శంకరాచార్య.భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మయోగం, హఠయోగం, సన్యాసం, మంత్ర యోగం ఇలా ఎన్నో మార్గాలను మనకు పెద్దలు... Read more

  • Swamy vivekananda quotes

    Apr 30 | భూమి ఒక్క గొప్ప వ్యాయామశాలఇక్కడికొచ్చి మనం శక్తివంతులుగా తయారవుతాం - స్వామి వివేకానందమానవ జీవితాన్ని ఎందరో ఎన్నో రకాలుగా వర్ణించారు.  కొందరు దీన్ని రంగస్థలం, దీని మీద మనం ఆడేది నాటకం అని అన్నారు. ... Read more