మహా కవి, యోగి, శాంతి దూత రవీంద్రనాథ టాగూర్ 1913 లో తను రాసిన గీతాంజలి పుస్తకానికి నోబెల్ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. యూరోపియనేతరులకు నోబెల్ పురస్కారం అందటం అదే మొదటిసారి.
సామాన్యంగా బాధలనుంచి రక్షించమనీ, కాపాడమని దేవుడిని ప్రార్థిస్తారు. కానీ, బాధలను తీసెయ్యమని కాకుండా, ఆ బాధలను ఎదుర్కునే ధైర్యాన్నివ్వమని ప్రార్దించమంటారు టాగూర్.
బాధలు తీసెయ్యమంటే అర్థం, ఆ కష్టాలు గట్టెక్కటానికి కావలసిన వనరులను ఇవ్వమని, దానితో నేనే ఆ కష్టాలనుంచి బయటపడతానని చెప్పటం అవుతుంది. అలాకాకుండా, ఆ కష్టాలను ఎదుర్కునే ధైర్యాన్నివ్వమని ప్రార్థించమంటున్నారు కానీ శక్తి సామర్థ్యాలివ్వమని కాదు. శక్తి సామర్థ్యాలు, వనరులు ఉంటే మనం మన కృషితో బయట పడటమెలా అవుతుంది
బాధలు, కష్టాలు వాస్తవానికి మానవునికి పరీక్షలు. అందుకే బాధలు కలిగినప్పుడు దేవుడు పరీక్ష పెడుతున్నాడు అనేవారు పూర్వకాలం. పరీక్షల నుంచి బయటపడటానికి రెండు మార్గాలున్నాయి.
ఒకటి, వాటిని తప్పించుకుని పరీక్షలకు పోకుండా ఉండటం, రెండు, పరీక్షలు రాసి ఉత్తీర్ణులవటం. రెండిటిలో ఏది చేసినా పరీక్షల నుంచి బయటపడతాం. కానీ మొదటిది చేస్తే ప్రస్తుతానికి అవి ఇబ్బంది పెట్టకపోయినా ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ మన జీవితంలో తారసపడతాయి. అదే ఆ పరీక్షల నుంచి ఉత్తీర్ణులవుతే మరోసారి ఆ పరీక్షలు మనకు ఎదురవవు. కాబట్టి ఆ రెండిటిలో ఏది శ్రేయస్కరమన్నది స్పష్టంగా ఉంది.
అసలు పరీక్షలెందుకు ఉంటాయి. మనమే స్థాయిలో ఉన్నామో తెలుసుకోవటానికి. మనకి మనకీ తెలుస్తుంది, మనకి మార్కులు వేసేవారికి- అంటే మన స్థాయిని నిర్ణయించే అధికారం ఉన్నవాళ్ళకీ తెలుస్తుంది. మనమే స్థాయిలో ఉన్నామో తెలిస్తే మనలను మనం అభివృద్ధి చేసుకోగలం. మన గురించి మనకే తెలియకపోతే ఎప్పటికీ ఆ తెలియని స్థాయిలోనే ఉండిపోతాము.
అందుకే పరీక్షలు అవసరం. వాటి నుండి గట్టెక్కించండి అని అధ్యాపకుడిని కోరితే, ఆయనకెంత సేపు పని. కానీ దానివలన మీ స్థాయిలో మార్పు రాదు కదా. అందువలన మనం కోరుకోవలసిందేమిటంటే, పరీక్షలు రాయటానికి అవసరమైన కృషి చెయ్యటంలో మార్గదర్శనం, ప్రోత్సాహం. అదే ధైర్యాన్ని ఇవ్వమని అడగటమంటే.
అందుకే భగవంతుడిని కూడా, కష్టాల నుంచి గట్టెక్కించమని కాకుండా, కష్టాలను ఎదుర్కునే ధైర్యాన్ని ప్రసాదించమని కోరుకోమని టాగూర్ చెప్తున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Oct 29 | బాధ పెట్టినా, పెట్టకపోయినా నిజాన్ని ధైర్యంతో గంట కొట్టినట్లు చెప్పండి. బలహీనతను గురించి ఎప్పుడూ ఆలోచించకండి. బుద్ధిమంతులు నిజాన్ని భరించలేక పోతే లేదా దానిలోవడి కొట్టుకుపోతారనుకుంటే కూడా దిగులు పడకండి. అలాంటి వ్యక్తులు ఎంత... Read more
May 03 | ప్రార్ధన అంటే ఉదయం లేచినప్పుడు తాళం చెవి, రాత్రి పడుకునేముందు తలుపు గడియ- మహాత్మా గాంధీప్రార్ధన చేస్తూ ఉదయాన్ని ప్రారంభించండి, పడుకునే ముందు ప్రార్ధన చెయ్యండి అని చెప్పటాన్ని ఆ విధంగా సుందరమైన ఉపమానంతో... Read more
May 02 | శిశువు జన్మించినప్పుడల్లా దేవుడింకా మానవజాతిమీద నమ్మకాన్ని పోగొట్టుకోలేదనే సంకేతం వస్తుంది - రవీంద్రనాథ్ టాగూర్ ఎంత చక్కని ఆలోచన ప్రకృతిలో మానవజాతి అంతరించకుండా చూస్తున్నాడంటే దేవుడికింకా మానవుల మీద నమ్మకం పోలేదన్నమాట. తన... Read more
May 01 | ముక్తిమార్గంలో అత్యుత్తమమైనది భక్తి మార్గం. అందులో లక్ష్యం ఎవరిని వారు తెలుసుకోవటం - ఆది శంకరాచార్య.భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మయోగం, హఠయోగం, సన్యాసం, మంత్ర యోగం ఇలా ఎన్నో మార్గాలను మనకు పెద్దలు... Read more
Apr 30 | భూమి ఒక్క గొప్ప వ్యాయామశాలఇక్కడికొచ్చి మనం శక్తివంతులుగా తయారవుతాం - స్వామి వివేకానందమానవ జీవితాన్ని ఎందరో ఎన్నో రకాలుగా వర్ణించారు. కొందరు దీన్ని రంగస్థలం, దీని మీద మనం ఆడేది నాటకం అని అన్నారు. ... Read more