Lokpal bill passed in parliament

lokpal bill passed by parliament, parliament passes lokpal bill, jan lokpal bill, lokpal bill clears lok sabha, parliament, rajya sabha, lok sabha, telangana bill, ap bifurcation, devyani khobragade, devyani khobragade issue, devyani khobragade issue outrage in parliament, anna hazare, political news, latest telugu news, breaking news, headlines

Parliament passes Lokpal bill

ఉభయసభల్లో పాసైన లోక్ పాల్ బిల్లు

Posted: 12/18/2013 06:15 PM IST
Lokpal bill passed in parliament

ఎట్టకేలకు .. లోక్ పాల్ బిల్లు పార్లమెంట్లో పాసైంది. దీంతో అన్నా హజారే ఆనందంగా ఉన్నారు. ఇన్నాళ్లు కు లోక్ పాల్ బిల్లు కు ఎట్టకేలకు మోక్షం లభించింది. లోక్ పాల్ బిల్లుకు నిన్న రాజ్య సభ అమోదం తెలపగా, ఇవాళ లోక్ సభ అమోద ముద్ర వేసింది. లోక్ పాల్ బిల్లును పార్లమెంట్ ఆమోదించడంతో అన్నా హజారే దీక్షా శిబిరం వద్ద సందడి నెలకొంది. ఈరోజు ఉదయం ప్రశ్నోత్తరాల తర్వాత లోక్ సభ పున: పరిశీలన నిమిత్తం లోక్ పాల్ బిల్లును కేంద్రం సభలో ప్రవేశపెట్టింది. కేంద్రం మంత్రి కపిల్ సిబల్ చర్చను ప్రారంభిస్తూ .. రెండేళ్లుగా లోక్ పాల్ పై సభ లోపల, వెలుపల చర్చ జరుగుతోన్నారు. లోక్ పాల్ పై సెలెక్ట్ కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని తుది రూపం ఇచ్చినట్లు చెప్పారు.

 

ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ.. లోక్ పాల్ బిల్లును పున: పరిశీలించి ఆమోదిద్దామని సూచించారు. కేంద్రానికి వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారని విమర్శించారు. లోక్ పాల్ బిల్లును ఆమోదించే విషయంలో కేంద్రం ఏడాది జాప్యం చేసిందన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. లోక్ పాల్ బిల్లు ఆమోదంతో చరిత్ర నెలకొల్పబొతున్నామన్నారు. లోక్ పాల్ తో మాత్రమే అవినీతి నిర్మూలన సాద్యం కాదని రాహుల్ వ్యాఖ్యానించారు.

 

లోక్ పాల్ బిల్లుకు పార్లమెంట్ లో ఆమోదం లభించడంతో రాలెగావ్ సిద్దిలోని అన్నా హజారే దీక్షా శిబిరం వద్ద సంబరాలు జరుపుకున్నారు. లోక్ పాల్ బిల్లును లోక్ సబ ఆమోదిస్తే దీక్ష విరమిస్తానని అన్నా హజారే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు హజారేక మద్దతుగా నినాదాలు చేశారు.

 

అన్నా హజారే మాట్లాడుతూ .. రెండేళ్లుగా లోక్ పాల్ బిల్లు కోసం పోరాటం చేశామని, లోక్ పాల్ బిల్లు ఆమోదం కోసం కష్టపడిన వారందరికి క్రుతజ్నతలు తెలిపారు. లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలందరూ బలమైన లోక్ పాల్ నుకోరుకుంటున్నారన్నారు.లోక్ పాల్ తోఅవినీతి నిర్మూలన సాద్యం కాకపోయినా, ప్రజలకు ఉపశమనం లాంటిదన్నారు. లోక్ పాల్ లో సవరణలు సూచించిన సెలెక్ట్ కమిటికి ధన్యవాదాలు తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లోపు లోక్ పాల్ చట్టం అమల చేయాలని హజారే డిమాండ్ చేశారు. ఉభయసభల ఆమోదం పొందిన లోక్ పాల్ బిల్లును ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదానికి పంపించింది. రాష్ట్రపతి ఆమోద ముద్రతో లోక్ పాల్ -2011 చట్టం అమల్లోకి వస్తుంది .

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more