కేంద్ర హోంశాఖమంత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాసిన లేఖపై వివరణ కోరుతూ ఆ లేఖ ప్రతిని రాష్ట్రపతి భవన్ కార్యాలయం కేంద్ర హోం శాఖకు పంపిన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు న్యాయనిపుణులతో, హోంశాఖ అధికారులతో చర్చించిన పిమ్మట హోంమంత్రి షిండే రాష్ట్రపతిని కలిసి సీఎం లేఖపై వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కూడా రాష్ట్రపతికి రాసిన లేఖపై ఇప్పటికే ఆరా తీసిన రాష్ట్రపతి భవన్ కార్యాలయం... ఈ రెండు అంశాల మీద స్పష్టత ఇవ్వాల్సిందేనని హోంశాఖను ఆదేశించిన నేపథ్యంలోనే షిండే రాష్ట్రపతి భవన్‌ను సందర్శించినట్లుగా ఢిల్లీ వర్గాలు భావిస్తున్నాయి.
రాష్ట్ర విభజన అంశంలో హోంశాఖ అనేకమార్లు తన వైఖరిని మార్చుకోవడం కాంగ్రెస్‌తోనూ, యూపీఏ ప్రభుత్వంతోను సమన్వయం లేకుండా నిత్యం భిన్న ప్రకటనలు చేస్తుండడం రాష్ట్రపతికి ఆగ్రహం తెప్పించిందని తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు సంప్రదింపులు పూర్తి అయ్యాయని వెల్లడించిన హోంశాఖ తాజాగా సంప్రదింపులు, అఖిల పక్షం, సూచనలు, సలహాలంటూ గందరగోళానికి తెర లేపడం సరికాదని రాష్ట్రపతి షిండేకి క్లాసు పీకినట్లు తెలుస్తోంది.
అఖిల పక్షం, సంప్రదింపులు అనే మాట కేంద్రం నుంచి వచ్చిన దరిమిలా తెలంగాణలో రాష్ట్ర విభజనపై విశ్వాసం సన్నగిల్లి అలజడి, ఆందోళనలు చెలరేగే ప్రమాదం ఉందని, పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ ప్రజల్ని ఆయోమయంలోకి పడేయడం మంచిది కాదని ప్రణబ్ తీవ్రస్థాయిలో షిండేతో అన్నట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రాష్ట్ర విభజనకు కట్టుబడి ఉన్నట్లైతే అందుకు సంబంధించిన ప్రక్రియను రాజ్యాంగ బద్దంగా ఇరు ప్రాంతాల వారికీ అమోదయోగ్యమైన రీతిలో పంచాయితీ పెద్దలా వ్యవహరించాలని సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు రాష్ట్రపతితో భేటీ అనంతరం కేంద్రహోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే విభజన ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు.
రాష్ట్రపతికి ఆగ్రహాన్ని చవి చూసిన కేంద్ర హోంమంత్రి షిండే... రాష్ట్ర విభజన అంశంలో పక్షపాతానికి తావు లేదని, అన్ని ప్రాంతాలవారు కేంద్రానికి సమానమేనని వివరించినట్లు తెలిసింది. ఇరు ప్రాంతాలకు న్యాయం చేసేందుకే మరోమారు అఖిల పక్షాన్ని, సంప్రదింపులు జరుపుతున్నామని స్పష్టం చేసినట్లు సమాచారం. పలుమార్లు రాజ్యాంగ నిపుణులు, న్యాయశాస్త్ర కోవిదులతోనూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోనూ చర్చించిన తరువాతే విభజనకు కేంద్ర కేబినెట్ మొగ్గు చూపిన సంగతిని వివరించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో ప్రజలు భావోద్వేగాలకు లోనుకావడం సర్వ సాధారణమేనని, అయితే అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నట్లు షిండే అన్నట్లు తెలిసింది.
కేంద్ర మంత్రుల బృందానికి రాష్ట్ర విభజనపై సలహాలు, సూచనలు, నివేదికలు పంపాలని కోరినట్లుగా ప్రభుత్వం నుంచి ఓ అధికారిక ప్రకటన జారీ అయిన విషయాన్నీ రాష్ట్రపతి దృష్టికి షిండే తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ... కేంద్ర, రాష్ట్ర విభాగం విడుదల చేసిన బహిరంగ ప్రకటన ప్రతిని కూడా రాష్ట్రపతికి సమర్పించినట్లు తెలుస్తోంది. దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో డైరెక్టర్‌గా ఉన్న అశుతోష్ జైన్ పేరుతో డైరెక్టర్ ఆఫ్ ఎడ్వర్టైజ్‌మెంట్ అండ్ విజువల్ పబ్లిసిటీ విభాగం విడుదల చేసిన ప్రతిని షిండే రాష్ట్రపతికి సమర్పించినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more