టాలీవుడ్ లో రికార్డు వసూళ్ళను సాధించి, వంద కోట్లకు పరుగులు తీస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా ‘అత్తారింటికి దారేది ’ చిత్ర యూనిట్ ప్రేక్షకులకు దీపావళి కానుకను అందించబోతుంది. ఈ సినిమాలో ఆరు నిమిషాలు నిడివి ఉండే సన్నివేశాలను ఈనెల 31వ తేదీ నుండి ప్రేక్షకులకు అందించబోతున్నామని, సెకండాఫ్ లో బ్రహ్మానందం కామెడీ తో పాటు అభిమానుల్ని అలరించే మరిన్ని సీన్లను జత చేస్తున్నట్లు ఆ చిత్ర నిర్మాత అయిన బీవీఎస్ఎన్ ప్రసాద్ తెలిపారు.
ఇప్పటికే మగధీర రికార్డుల్ని బద్దలు కొన్ని ఇప్పటి వరకు 73 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాను 100 కోట్ల క్లబ్లులో పడేయడానికి నిర్మాతలు ఈ చిన్న ట్రిక్కును ప్లే చేస్తున్నారని అంటున్నారు. ఈ చిత్రం విజయం పై నిర్మాత మాట్లాడుతూ... పైరసీ ఈ సినిమా కలెక్షన్ల పై ఏ మాత్రం ప్రభావం చూపలేక పోయిందని అది పవన్ సినిమా స్టామినా అని , బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సాధిస్తున్న విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. దీపావళి పండగ సెలవుల్లో అభిమానులు ఈ చిత్రాన్ని మరింతగా ఎంజాయ్ చేయండని నిర్మాత చెప్పుకొచ్చారు.
అయితే కొంత మంది సినీ విశ్లేషకులు మాత్రం ‘అత్తారింటికి దారేది ’ సినిమా కలెక్షన్లు డ్రాప్ అయ్యాయని, అందుకే ఈ సీన్లు జత చేసి ప్రేక్షకుల్ని థియేటర్ కి రప్పించేందుకే ఈ హంగామా అని, టాలీవుడ్ లో ప్రస్తుతం ఏ చిత్రం ఊపు మీద లేదు కాబట్టి ఈ చిత్రం హవా కొనసాగుతుందని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొంది సెప్టెంబర్ 27 తేదిన విడుదలైంది. ఈ చిత్రంలో సమంత, ప్రణీత, బోమన్ ఇరానీ, నదియాలు నటించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more