ప్రభుత్వం ఎక్కడైన ఉద్యోగులకు భోనస్ ప్రకటించటం అందరికి తెలుసు. అయితే ఈ సారి మాత్రం ప్రభుత్వోద్యోగులకు డ్రెస్ కోడ్ పెట్టాలని కర్ణాటక ప్రభుత్వం ఆలోచింస్తుంది. తిరుమలలో భక్తులకు డ్రెస్ కోడ్ విధించినట్లు ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఉద్యోగులకు డ్రెస్ కోడ్ పాటించాలని ఆదేశాలు జారీ చెయ్యటానికి సిద్దంగా ఉంది. ఎప్పుడులేనిది ఇప్పుడు కొత్తగా డ్రెస్ ఎందుకు అంటే? కొన్ని విచిత్రమైన సమాధానాలు చెబుతున్నారు. జూనియర్స్ వేసుకొనే డ్రెస్ వలన .. సీనియర్లకు చాలా ఇబ్బందిగా ఉందని కొంతమంది సీనియర్ ఉద్యోగులు ఫిర్యాదు చేయటం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా మహిళలపై జరిగే దాడులను ఎదుర్కోలేని కర్ణాటక ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులకు డ్రెస్ కోడ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. స్త్రీలు చీరలు, సల్వార్ కమీజులు ధరించాలని, పురుషులు ఫార్మల్ ప్యాంట్ షర్టు లేదా కుర్తా పైజమాలు ధరించాలని ఈ ఆదేశాలలో పేర్కొంది. డిజైనర్ బ్లౌజులు, జీన్స్, టీషర్టులు లాంటి దుస్తులు ధరించి కార్యాలయానికి రావడం సబబు కాదని, ఉద్యోగస్తులు హుందాగా కనిపించడం అవసరమని తెలిపింది. యువ ఉద్యోగస్తులు కాజువల్ దుస్తుల్లో ఆఫీసుకు రావాలని సీనియర్లు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదని.. అందుకే లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేయాల్సి వస్తోందని ఈ సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యమంత్రి అనుమతితో సెప్టెంబరు 12న డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్స్ అధికారి ఈ ఆదేశాలు విడుదల చేశారు. అయితే దీనిపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులకు డ్రెస్ కోడ్ విధించటం వలన వారి స్వేచ్చకు భంగం కలిగినట్లేనని కొంతమంది ఉద్యోగులు విమర్శల దాడి చేస్తున్నారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more