D srinivas meets on sonia gandhi

d srinivas meets on sonia gandhi, Former PCC President D Srinivas, Cong Sr Leader D Srinivas Meets Sonia gandhi, Congress president Sonia Gandhi

d srinivas meets on sonia gandhi, Telangana D Srinivas meets Sonia Gandhi,

ధర్మపురి సోనియా దగ్గర చెప్పిన ధర్మ సూత్రం

Posted: 09/14/2013 10:37 AM IST
D srinivas meets on sonia gandhi

సీమాంధ్ర ఉద్యమం, తెలంగాణ విభజన ప్రక్రియ అంశానికి సంబంధించి నెలకొన్న పరిస్థితులపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆరాతీశారు. విదేశీ పర్యటన ముగించుకుని ఆమె స్వదేశానికి వచ్చాక పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌ (డీఎస్‌) ఈ రోజు ఉదయం కలిసి ఆమెతో ముప్పావుగంటపాటు మంతనాలు జరిపారు. తెలంగాణ విభజన ప్రకటన వెలువడ్డాక ఈ ప్రాంతంలో చోటుచేసుకున్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై సోనియా సమాచారం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ సీమాంధ్రలోని 13 జిల్లాల్లో జరుగుతున్న ఉద్యమాలు, ఆందోళనలపై సోనియా చర్చించినట్టు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. తెలంగాణ విభజన ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఆసన్నమైందని, ఈ విషయంలో జాప్యం జరిగితే పరిణామాలు మరోవిధంగా ఉంటాయని డీఎస్‌ చెప్పినట్టు సమాచారం. హైదరాబాద్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవలసి ఉందని కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయానికి వస్తామని సోనియా వివరించినట్టు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌ను పదేళ్ళపాటు ఇరు రాష్ట్రాలకు రాజధానిగా ఇప్పటికే ప్రకటించామని, అయితే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు రాజధాని విషయంలో పునరాలోచించాలని కోరుతున్న విషయాన్ని ఆమె గుర్తు చేసినట్టు సమాచారం. రాజధాని హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగమని ఈ ప్రాంతాన్ని ఉమ్మడి రాజధానిగా ప్రకటించినా, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రతిపాదించినా ఉద్యమాలు ఉవ్వెత్తున సాగుతాయని డిఎస్‌ చెప్పినట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more