Narendra modi formally anointed bjps prime ministerial candidate

Modi BJPs prime ministerial candidate, Venkaiah Naidu,Twitter,Tarun Gogoi,Sushma Swaraj,Shivraj Singh Chouhan,Rashtriya Swayamsevak Sangh,Rajnath Singh,Rahul Gandhi,Nitin gadkari,National Democratic Alliance,Narendra Modi,Digvijaya Singh,Congress,BJP,Atal Bihari Vajpayee,Arun Jaitley,Arjun Munda,Ananth Kumar,Advani

Narendra Modi has formally bagged BJPs prime ministerial nomination.

నమో:కే పట్టం కట్టిన కమలనాధులు

Posted: 09/14/2013 09:24 AM IST
Narendra modi formally anointed bjps prime ministerial candidate

2014 లో భారత ప్రధాని అభ్యర్థి బీజేపీ తరుపున ఎవరు నియమితులు కాబోతున్నారు ? ఈ ప్రశ్నకు గత కొన్ని రోజులుగా సమాధానం దొరకడం లేదు. బీజేపీ అగ్రనాయకత్వంలో దాదాపు అందరు మోడీ వైపే వేలు చూపిస్తుంటే, అగ్రనేత అద్వానీ బ్రేకులు వేస్తూ వచ్చారు. కానీ ఎట్టకేలకు బీజేపీ ప్రధాని అభ్యర్థిని పార్టీ ప్రకటించింది. అద్వానీ అలక బూనినా అతన్ని ఏమాత్రం లెక్కచేయకుండా అగ్రనేతలు అంతా నమో: కే జై కొట్టారు. ఈ అంశంలో కొద్దినెలలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం మోడీని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ప్రకటించారు. దీంతో భారతీయ జనతాపార్టీలో నవశకం... అది ‘నరేంద్ర మోదీ శకం ’ ప్రారంభమైంది. ఇప్పటికే పార్టీ ఎన్నికల ప్రచార సారథిగా నియమితుడైన మోదీ... ఇప్పుడు ‘బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి ’ గా నియమితులైయ్యారు. మోడీ రాకతో అద్వానీ శకం ముగిసినట్లయింది. పన్నెండు మంది సభ్యులు గల బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీకి మోడీపై కినుక వహించిన అద్వానీ మినహా మిగిలిన నేతలందరూ హాజరయ్యారు. సుష్మా స్వరాజ్, మురళీమనోహర్ జోషీ, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కారీ తదితర సీనియర్ నేతలు సహా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అద్వానీని సమావేశానికి రప్పించేందుకు సీనియర్ నేతలు చివరి నిమిషం వరకు ఎంతగా ప్రయ త్నించినా ఫలితం లేకపోయింది. ఇక ప్రధాని అభ్యర్థిగా మోడీ ఎన్నికైన తరువాత పార్టీ అగ్రనేతలందరికీ తన ధన్యవాదాలు తెలిపారు. మోడీ నియామకానికి బ్రేకులు వేస్తూ వస్తున్న అద్వానీని తన రాజకీయ గురువుగా చెప్పుకుంటున్న  మోడీ ఆయన ఇంటికి ఆశీస్సులు తీసుకున్నారు. మోడీ ఆశీస్సులు తమకు ఎప్పటికి ఉంటాయని, ఆయన సూత్రాలను తూ.చ. తప్పకుండా పాటిస్తానని మోడీ చెప్పుకొచ్చారు. ఇక పార్టీ బలోపేతానికి తనవంతు క్రుషి చేస్తానని మోడీ చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more