సమైక్యాంద్ర పరిరక్ష వేదిక , ఏపీ ఎన్జీవోలు స్థానిక ఎల్బీ స్టెడియంలో ఏర్పాటు చేసిన సభ ప్రారంభమైంది. ఈ సభకు పెద్ద ఎత్తున సీమాంద్ర జిల్లాల నుంచి ఉద్యోగులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఎన్జీవోలు, ఉపాద్యాయ సంఘాలు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు, ప్రతినిధులు ఈ సభకు హాజరయ్యారు.
లోపల ఆకలి మంట
పైన ఎండ మండుతోందని, లోపల ఆకలి మంట వేధిస్తోందని అయిన ఇంతమంది సభకు హజరై సమైక్యవాదనను బలపరచడం ఆనందం కలిగిస్తోందని సమైక్యాంద్ర పరిరక్షణ వేదిక , ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మనకి నచ్చకపోతే తెలియజేయడానికి మనకింకా రిఫరెండం సదుపాయం లేదని, ఎన్నికల్లో ఓట తప్ప మరో మార్గం లేదని ఆయన గుర్తు చేశారు. అందుకే ప్రజలకు, రాజకీయ నాయకులకు తమ అభిప్రాయాలను తెలియజేయడానకి మాత్రమే సభ పెట్టామన్నారు. రాజకీయ పార్టీలను ప్రజలు పాలించమని ఎన్నుకొన్నారు తప్ప విడదీయడానికి కాదన్నారు. అసెంబ్లీ లో చర్చ జరిగి దాని మీద నిర్ణయం వస్తే ప్రజలు కొంతవరకు అనుమతించేవారు.కానీ కొన్ని పార్టీలు కేవలం అదికారం కోసం విభజన నిర్ణయాన్ని ప్రజల మీద రుద్దడాన్ని అంగీకరించలేమన్నారు.
ఎక్కువ నష్టం
రాష్ట్ర విభజన వల్ల ముఖ్యంగా మూడు వర్గాలవారికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. విద్యార్థులు, ఆర్టీసీ సిబ్బంది, ఉద్యోగులు విభజన వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తుందని ఆయన చెప్పారు.
మోజులేదు
తనకు రాజకీయాలపై మోజు లేదని, రాజకీయాల్లోకి రానని అశోక్ బాబు స్పష్టం చేశారు. చాలామంది తన గురించి రరరకాలుగా అనుకుంటున్నారని అందుకే ఈ విషయం స్పష్టం చేస్తున్నానన్నారు. అయితే ఉద్యోగులుగా తాము కలిసి నిర్ణయాలు తారుమారు కాగలవని , ఆ శక్తి ఉద్యోగులకు ఉందని అశోక్ బాబు అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more