విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన సభను సక్సెస్ చేసేందుకు సీమాంధ్ర ప్రాంత నేతలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి ఐకాసాలు సన్నాహాలను ముమ్మరం చేశాయి. హైదరాబాద్ సభ ద్వారా సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులపై వత్తిడి పెంచే యత్నాలకు మరింత పదునుపెట్టనున్నారు. సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఉద్యోగ, కార్మిక, విద్యార్థి, ఉపాధ్యాయ నేతలు హైదరాబాద్ సభకు తరలి రావాలని పిలుపు నిస్తున్నారు. మరో పక్క హైదరాబాద్‌లోని ఎపిఎన్జీవో భవన్‌లో రోజుకో ఉద్యోగ సంఘం నేతలు సమావేశమై సభ సక్సెస్ కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 40 లక్షల మంది సీమాంధ్ర ప్రాంతవాసులున్నారని, వీరందరి సహాయ సహకారాలను తీసుకోవాలని నిర్ణయించారు. హైదరాబాద్ మినహా మిగతా తొమ్మిది తెలంగాణ జిల్లాలలోనూ భారీ ఎత్తున సీమాంధ్రులున్నారని, వీరందరినీ బహిరంగసభకు రప్పించేందుకు సన్నాహాలను చేస్తున్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. సభకు పోలీసు అనుమతి లభించడం అనుమానాస్పదం కావడంతో న్యాయస్థానం ద్వారా సాధించుకునేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్దం చేస్తున్నారు. సచివాలయం లో జరుగుతున్న సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళన, విద్యుత్ సౌధలో జరుగుతున్న పోటాపోటీ ప్రదర్శనలపై చర్చించుకుంటున్న ఆయా సంఘాలు హైదరాబాద్ సభకు అన్ని ప్రాంతాల మద్ధతు కూడగట్టాలని, సభలో వీలైనంత ఎక్కువ మందిని సీమాంధ్రేతరులతో మాట్లాడిస్తే ఉద్యమానికి మరింత బలం లభిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమైక్యాంధ్ర బ్యానర్‌పై సభ నిర్వహిస్తున్నందున కాంగ్రెస్ నేత తులసీరెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. విభజనకు అనుకూలంగా సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి ప్రధాన కారకులు సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులేనని, వారి నిర్లిప్తత వల్లే ఈ నిర్ణయం వెలువడిందని ఎపీఎన్జీవోలు మొదటి నుంచీ ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని బహిరంగసభ ద్వారా సీమాంధ్ర ప్రజలకు తెలియజేయడంతో పాటు వారి రాజీనామాలకు మరింత వత్తిడి పెంచేందుకు సభను ఆయుధంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఈ బహిరంగసభకు కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించాలని, అక్కడే వారి రాజీనామాలపై స్పష్టమైన హామీని తీసుకోవాలని భావిస్తున్నారు. సమైక్యాంధ్రకు సీమాంధ్రులతో పాటు పలువురు తెలంగాణ ప్రాంత వాసులు కూడా మద్ధతిస్తున్నారని, అలాంటి వారిని బహిరంగసభ వేదికపై ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడించాలని భావిస్తున్నారు. సభా వేదిక నిజాం కళాశాల మైదానం అనుకున్నా సభికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో మైదానానికి మారిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చ జరుగుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more