Kishore chandra deo feels only 3 way split can save ap

Telangana,Sonia Gandhi,Rayalaseema,Rahul Gandhi,Manmohan Singh,Lok Sabha,Kishore Chandra Deo,Kiran Kumar Reddy,Himachal Pradesh,Ghulam Nabi Azad,Congress,AndhraPradesh

Tribal Affairs Minister Kishore Chandra Deo, a union cabinet heavyweight from Andhra Pradesh.

బొత్స సీఎం పదవి కోసం... కిరణ్ ఉన్నదాన్ని కాపాడుకోవడం కోసం

Posted: 08/26/2013 09:08 AM IST
Kishore chandra deo feels only 3 way split can save ap

కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, పీసీసీ బొత్స సత్యనారాయణల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా మాజీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి గులాంనబీ ఆజాద్ తీరు పై కూడా ఆయన మండిపడ్డారు. ఐసిసి అధినేత్రి సోనియాగాంధీకి ఆరుపేజీల లేఖాస్త్రాన్ని సంధిస్తూ పలు విషయాలు ప్రస్తావించాడు. గతంలో నుండే బొత్స, కిషోర్ లకు విభేదాలు ఉన్నాయని తెలిసిందే. అవి మళ్లీ ఇప్పుడు మరోసారి బయటపడ్డాయి. సోనియాకు రాసిన లేఖలో తెలంగాణ అంశం గురించి, బొత్స, సీఎంల గురించి ప్రస్తావించడం విశేషం. రాష్ట్రాన్ని విభజిస్తే మూడు రాష్ట్రాలుగా విభజించి, హైదరాబాద్ ని యూటీ చేయాలని అంటూనే... 2014 దాకా ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి యత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా సీమాంధ్ర రాష్ట్రం ఏర్పడితే ముఖ్యమంత్రి కావాలనే యోచనలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వున్నార ని, బొత్స పైకి సమైక్య రాష్ట్రం కోరుకుంటున్న లోపల మాత్రం ప్రత్యేకవాదానికి మద్దతు ఇస్తున్నాడని ఆయన అన్నారు. 

తెలంగాణ వాదులతో పాటు ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో చర్చలు జరిపితే సరిపోతుందా ? అన్ని ప్రాంతాల అభిప్రాయాలు సేకరించిన తరువాతనే వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సిందని ఆయన ఆ లేఖలో అభిప్రాయ పడ్డారు. ఇక్కడ విశేషం ఏంటంటే... కిషోర్ చంద్రదేవ్, బొత్సలు విజయనగరం జిల్లాకు చెందిన వారే. తెలంగాణ ఇవ్వడమే బెటర్ అని అజాద్ ఇచ్చిన నివేదిక ఫలితంగానే ఈ పరిణామాలు జరిగాయన్నది కాంగ్రెస్ వర్గాలలో ఉన్న ప్రచారం. దానికి అనుగుణంగా కిషోర్ వ్యాఖ్యలు చేయడం మరింత ఆసక్తిని కలిగిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more