కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ రోజు సాయంత్రం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ప్రసంగంలో ఆయన్నే టార్గెట్ చేసి మాట్లాడారు. తెలంగాణ పై లేనిపోని వాస్తవాలు చెబుతూ, ప్రజలను రెచ్చగొడుతూ యువకులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాడని, ఆయన మాటలు విని ఇప్పటికే ఎంత మంది అమాయకులు ప్రాణాలు తీసుకున్నారని, తెలంగాణ పై కేసీఆర్ వాదన తప్పని, సీమాంధ్ర నాయకులు దోపిడి దొంగలు, దోపిడి దారులు అంటూ తిట్ల దండకం మొదలు పెట్టే కేసీఆర్ మాటలు విని తెలంగాణ ఇస్తారా అని ఉండవల్లి ఆరోపించారు. కేసిఆర్ ఓ పిచ్చోడు, అలాంటి పిచ్చోడి మాటలకు తలవంచి తెలంగాణ ఇస్తే అమాయక ప్రజలు బలవుతారని, తెలంగాణ పై అందరి ఏకాభిప్రాయం లేనిదే తెలంగాణ వచ్చే అవకాశం లేదని, ఒకవేళ తెలంగాణ ఇస్తే నష్టపోయేది తెలంగాణ ప్రజలేనని ఉండవల్లి అన్నారు. తిట్లు , డబాయింపులతో తెలంగాణ తెచ్చుకోవాలని చూస్తే తాము సిద్దంగా లేమని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రజలకు కెసిఆర్ వాస్తవాలను తెలియనివ్వడంలేదన్నారు. కెసిఆర్ అలా మాట్లాడటం ప్రాంతీయ ద్రోహమే కాకుండా, దేశద్రోహం అని, తెలంగాణ అడికే హక్కు వారికి ఉందని అంటూనే మద్రాసు రాష్ట్రం విడిపొయినప్పటి సంఘటన గుర్తు చేశారు. తెలంగాణవాదుల ఆరోపణలపై ఉమ్మడివేదికపై చర్చకు కేసీఆర్ సిద్దమేనా అని సవాల్ విసిరారు. తెలంగాణ ఇస్థే దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు లొల్లి ఎక్కువవుతుందన్నారు . కల్లిబొల్లి మాటలు చెప్పే కేసీఆర్ తెలంగాణ ఏర్పాటుకు సరైన కారణాలు చెప్పగలడా అన్న ఉండవల్లి సొంత పార్టీ అయిన కాంగ్రెస్ తెలంగాణ నాయకులు చేసిన డిమాండ్లు, కాంగ్రెస్ అధిష్టానం పై వారు చేసిన వ్యాఖ్యల పై ఉండవల్లి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more