మొయిలీ, ఆజాద్, వయలార్, సీనియర్ రాజకీయ నేతలు ఆంద్రప్రదేశ్ రాజకీయాల ముందు ఎగిసి, అలసి, సొలసి, ఓడిపోయారు. ఇప్పుడు కొత్త మరో క్రిష్టుడు రాష్ట్రానికి వస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా దిగ్విజయ్‌సింగ్‌ను హైకమాండ్ నియమించింది. గతంలో ఏపీలో పని చేసిన అనుభవం ఉన్న దిగ్విజయ్‌సింగ్‌కు.. జగన్, తెలంగాణ అంశాలు పూర్తిగా అవగాహన ఉన్నాయి. పైగా రాహుల్‌కు నమ్మకస్తుడు కావడంతో ఏపీ వ్యవహారాల్ని అప్పగించారు. సమస్యల వలయంలో చిక్కుకున్న పార్టీకి ఇప్పుడీయనే చుక్కాని.కాంగ్రెస్ అధిష్టానం ఆపరేషన్ ఏపీ మొదలు పెట్టింది. జోడు పదవులు భారంగా మారాయని వేడుకొన్న ఆజాద్‌ను ఏపీ ఇంఛార్జ్‌గా తప్పించి.. దిగ్విజయ్ సింగ్‌కు ఆ బాధ్యత అప్పగించారు.దిగ్విజయ్ సింగ్‌కు ఏపీ వ్యవహారాలు నల్లేరుపై నడకైతే కాదు. సమస్యలతో సావాసం తప్పకపోవచ్చు. వాటిలో కీలకమైనవి.. రెండే. ఒకటి తెలంగాణ ఇష్యూ. మరోటి జగన్ ఫ్యాక్టర్. వైఎస్సార్‌తో మంచి సంబంధాలు నెరిపిన దిగ్విజయ్ సింగ్‌కు.. వైఎస్ ఫ్యామిలీపై ఏమాత్రం ప్రతికూల భావన లేదు.
పైగా.. వైసీపీ బలాన్ని అంచనా వేయడంలో.. సొంత పార్టీ నుంచి వలసల్ని నియంత్రించడంలో.. అవసరమైతే నెయ్యానికి సయ్యనడంలో చాకచక్యంగా వ్యవహరిస్తాని హైకమాండ్ భావించినట్టు కనిపిస్తోంది. మరోవైపు.. తెలంగాణ సమస్యపై పూర్తి అవగాహన ఉంది. ఆ సమస్యకు పరిష్కారం చూపే ఆలోచనలో ఉన్న హైకమాండ్.. ఆ దిశలోనే దిగ్విజయ్ నియామకాన్ని చేపట్టనట్లు సమచారం. 2004లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత... రాష్ట్రానికి ఇంఛార్జ్‌గా వ్యవహరించిన దిగ్విజయ్ సింగ్.. ఈసారి తన ఆధ్వర్యంలోనే ఎలక్షన్లను ఎదుర్కోనున్నారు. అప్పుడేమో హస్తం నేతల్లో హర్షం నెలకొని ఉండడం.. వైఎస్ వంటి నాయకుడి ఆధ్వర్యంలో అంతా ఏకతాటిపై సాగిపోయారు. ఇప్పటి సీన్ అందుకు పూర్తిగా భిన్నం. మొయిలీ, ఆజాద్, వయలార్ వంటి హేమాహేమీలు సైతం పార్టీని గాడిన పెట్టేందుకు తీవ్రంగా పనిచేసి.. ఢిల్లీకి పోయారు.
అయితే... ఇక్కడి నేతలు, వ్యవస్థలు, గ్రూపులపై పూర్తి అవగాహన ఉన్న దిగ్విజయ్ సింగ్.. సమస్యల స్వాగతాన్ని ఎలా ఎదుర్కొంటారు... ఎన్నికల్లో ఎలాంటి మ్యాజిక్ చేస్తోరో చూడాలి. ఆయన రాక పై అప్పుడే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జీగా దిగ్విజయ్ సింగ్ ని నియమిస్తే ఏమి ప్రయోజనమని సిపిఎం శాసనషభ పక్ష నేత జూలకంటి రంగారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరదించకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిలను మారిస్తే ఉపయోగమేముంటుందని ఆయన అన్నారు.ఇవన్నీ ఎన్నికల జిమ్మిక్కులుగా ఆయన తేల్చేశారు. గత తొమ్మిదేళ్లలో ముగ్గురు ఇన్‌చార్జిలు మారిపోయి, ఇప్పుడు నాలుగో కృష్ణుడిగా దిగ్విజయ్‌సింగ్ వచ్చారని రంగారెడ్డి వ్యంగ్యంగా అన్నారు. తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపితేనే మేలు జరుగుతుందన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more