రెండు రోజులపాటు జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు నేడు ప్రారంభం కానుంది. హైదరాబాద్ గండిపేటలోని ఎన్టీఆర్ కుటీర్‌లో ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఈ మహానాడులో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేస్తారు. సంక్షేమం, అవినీతి, వ్యవసాయం, రాజకీయ పరిస్థితులు, జలయజ్ఞం, ఇందిరమ్మ ఇళ్లు, కాంగ్రెస్ అస్తవ్యస్త పాలన తదితర పది అంశాలపై మహానాడులో తీర్మానాలు చేస్తారు. తెలుగుదేశం పార్టీ నేతలకు హరికృష్ణ గుబులు పుట్టింది.
గత అనుభవాలు పునరా వృతమవుతాయేమోనన్న దిగులు పట్టుకుంది. గత మహానాడులో హరికృష్ణ ప్రదర్శించిన ఆగ్రహ హావభావాలు వారిని వెంటాడుతున్నాయి. ఆయన కొంత కాలంగా పార్టీ కార్యక్రమా లకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకం గా చేపట్టిన ''వస్తున్నా.. మీ కోసం'' పాదయాత్ర ప్రారం భానికి హాజరైన హరి దాని ముగింపు సభకు దూరమయ్యారు. పాదయాత్ర సందర్భంగా బాలకృష్ణ జూనియర్ ఎన్‌టిఆర్‌కు వార్నింగ్ ఇవ్వడం ఆయనకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వైకాపా నేతలు జూనియర్ ఫోటోలను తమ ఫ్లెక్సీల్లో వాడుకోవడంపై బాలకృష్ణ స్పందించారు. జూనియర్ తక్షణం వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో తదుపరి పరిణామాలను జూనియర్ ఎదుర్కొనాల్సి ఉంటుందని బాలయ్య తీవ్రంగా స్పందించారు. ఆ ప్రకటన వెలువడ గానే హరికృష్ణ తీవ్రంగా ప్రతిస్పందించారు.
సీనీ కళాకారుడైన జూనియర్ ఫోటోను అభిమానులు ఎవరైనా వాడుకోవచ్చునంటూ ఆయన అంతే దీటుగా స్పందించారు. అప్పటి నుంచి చంద్ర బాబుతో హరికృష్ణకు విభేదాలు తీవ్రమయ్యాయి. అనంతర పరిణామాల్లో హరి మౌనంగా.. దూరంగా జరిగారు. అధినేత ముగింపు యాత్రకు సైతం ఆయన దూరంగా ఉన్నారు. యాత్ర ముగించుకుని రాజధానికి చేరిన చంద్రబాబును హరికృష్ణ కనీసం మర్యాద పూర్వకంగానైనా కలవలేదు. రాజ్యసభ సభ్యత్వం తో పాటు పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి పొలిట్‌బ్యూరో సభ్యునిగా వ్యవహరిస్తున్న హరికృష్ణ తీరు సరిగా లేదని పార్టీ వర్గాలలో బలమైన అభిప్రాయం ఏర్పడింది. మరో వైపు కళంకిత మంత్రులను తొలగించాలంటూ గవర్నర్‌కు వినతి పత్రం సమర్పించే కార్యక్రమానికి హరికృష్ణకు ఆహ్వానం అందలేదు.
అదే విధంగా రాష్ట్రపతికి అందించే సమయంలోనూ ఆయనను పార్టీ కానీ, పార్లమెంటరీ పార్టీ నేతగానీ పిలవలేదు. దాంతో హరికృష్ణ ఆగ్రహం పరాకాష్ఠకు చేరిందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఆ అంశమై అత్యున్నత పొలిట్‌బ్యూరో సభ్యుడైన ఆయన అందర్నీ సమన్వయం చేసే బాధ్యత విడనాడి.. నన్నెందుకు పిలవలేదని అలగడం అసమంజ సమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అన్నింటికీ ఒక్కడై చంద్రబాబు కష్టపడుతుంటే ఒక బాలకృష్ణ మినహా నందమూరి కుటుంబం నుంచి పార్టీకి అందుతున్న మద్దతు లేదు. ''పార్టీని నడిపేందుకు అవసరమైన భారీ నిధులను ఒక్క చంద్రబాబు నాయుడు సమకూర్చుకుంటున్నారు. తొమ్మి దేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న పార్టీకి నిధుల సమీకరణ ఎంత కష్టం? మా నాన్న పెట్టిన పార్టీ అని గుండెలు బాదుకునే నందమూరి తనయులు ఆ విషయంలో కొద్దిగానైనా చొరవ చూపరు. నమస్కరిస్తే ప్రతి నమస్కరించే సభ్యత కోల్పోయిన వారు రాజ్యసభ సభ్యత్వం వస్తే మాత్రం ముందు వరుసలో నిలుస్తారు.
అసలు పార్టీకి వారు చేసిందేమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటి'' అని పార్టీనే నమ్ముకొని ఏళ్లకేళ్లుగా పనిచేస్తోన్న ఒక నాయకుడు ఎన్టీ ఆర్ భవన్‌లో ఆ మధ్య పిచ్చా పాటి సంభాషణలో వ్యాఖ్యానించారు. గత మహానాడులో చంద్రబాబు అభిమా నులు పెద్ద ఎత్తున ఆయన కుమారుడు లోకేష్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అది హరికృష్ణకు ఆగ్రహం తెప్పించింది. పెడితే, గిడితే జూనియర్ ఎన్‌టిఆర్ బొమ్మలు పెట్టాలి. లోకేష్ బొమ్మ పెట్టడం ఏమిటన్నది ఆయన ఆగ్రహానికి కారణం. ఆయనను సముదాయించేందుకు సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు చేసిన యత్నాలు ఫలించలేదు.
తెలుగు దేశం పార్టీకి భవిష్యత్ నేతగా జూనియర్ ఎన్‌టిఆర్ ఉండాలన్నది నందమూరి కుటుంబ సభ్యుల అంతరంగమని ఒక వాదన ఉంది. అందుకు భిన్నంగా గత కొంత కాలంగా చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌ను ప్రొజెక్ట్ చేస్తుండడం వారికి నచ్చడం లేదు. తాత ఎన్‌టిఆర్ సినీ జనాభి మానాన్ని తిరిగి సాధించడంలో నందమూరి కుటుంబంలో ఒక్క జూనియర్‌కు మాత్రమే సాధ్యమైంది. దాంతో ఆయనకే తాత రాజకీయ వారసత్వం లభించాలన్నది నందమూరి వంశీకుల అభిమతంగా ఉంటే.. ఉన్నత విద్యా వంతుడైన లోకేష్ చంద్రబాబు పరిపాల నాదక్షతకు నిజమైన వారసులు కాగలరన్న బలమైన వాదన పార్టీలో ముందు కొచ్చింది.
తాజాగా మహానాడు నిర్వహిస్తోన్న క్రమంలో దానికి అసలు హరికృష్ణ, జూనియర్ హాజరవుతారా? హాజరైతే మామూలుగానే ఉంటారా? అధినేతకు ఇబ్బంది పెట్టే చర్యలకు పాల్పడతారా అన్న అనేకానేక ప్రశ్నలు తెలుగు తమ్ముళ్ల మదిని తొలుస్తున్నాయి. ఈ రెండు రోజుల్లో వారి అనేకానేక సందేహాలు నివృత్తి కావచ్చు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more